Purandeswari BJP president race: బిజెపి(Bhartiya Janata Party) జాతీయ పగ్గాలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు ప్రారంభించింది హై కమాండ్. ఈసారి మహిళలకు ఇవ్వాలని భావిస్తోంది. అందునా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. ముగ్గురు మహిళా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ఈ రేసులో ఉండడం విశేషం. మరోవైపు తమిళనాడు నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, వానతి శ్రీనివాసన్ సైతం పోటీ పడుతున్నారు. అయితే ఈ ముగ్గురు విషయంలో రకరకాల ప్రచారం నడుస్తోంది. ముగ్గురు తరపున బిజెపి జాతీయ నేతలు పావులు కదుపుతున్నారు. అయితే కొద్ది రోజుల్లో ఈ నియామకాన్ని పూర్తిచేసేందుకు బిజెపి హై కమాండ్ కసరత్తు చేస్తోంది. అయితే పురందేశ్వరి విషయంలో ఆర్ఎస్ఎస్ లో భిన్న వాదనలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు.
Also Read: చెప్పేవి శ్రీరంగనీతులు.. మీడియాను వ్యాపారం చేసేశారు.. ఇదే ‘యాపారం’
ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక..
భారతీయ జనతా పార్టీలో విధాన నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ( RSS ) ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి భర్తీ విషయంలో సైతం ఆర్ఎస్ఎస్ అనుమతి తప్పనిసరి. ఇక్కడే పురందేశ్వరికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇద్దరు మహిళ నేతలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. కానీ పురందేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరారు. ఇప్పుడు అదే పురందేశ్వరి నియామకం పై ఉన్న చిన్నపాటి అభ్యంతరం. పైగా పురందేశ్వరి ఎంపికతో ఏపీలో బిజెపికి వచ్చే ప్రత్యేక ప్రయోజనం అంటూ ఏదీ లేదు. ఎప్పటికీ ఇక్కడ ఎన్నికలు పూర్తయ్యాయి. పైగా టిడిపి కూటమిలో బిజెపి ఉంది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. సో రాజకీయంగా కూడా ఎటువంటి ప్రయోజనం బీజేపీకి లేదన్నమాట.
Also Read: హోమంత్రి పదవిపై కన్నేసిన రఘురామ.. ప్రతీకారం తీర్చుకుంటాడట!
వారిద్దరిదీ సుదీర్ఘ నేపథ్యం..
నిర్మల సీతారామన్( Nirmala sitaraman ) బిజెపి సీనియర్ నాయకురాలు. ఆమె 1990 నుంచి ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న నాయకురాలు. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేయగలరు. భారతీయ జనతా పార్టీ వాయిస్ను బలంగా వినిపించగలరు. పైగా వచ్చే ఏడాదిలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మిత్రపక్షాలతో కలిసి బిజెపి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే నిర్మలా సీతారామన్ అవసరం అక్కడ కనిపిస్తోంది. అందుకే ఆమె ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 1983 నుంచి ఆమె ఆర్ఎస్ఎస్ లో కొనసాగుతూ వచ్చారు. సీనియర్ మహిళా నేత కావడంతో ఆమెకు సైతం ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ తో పాటు బిజెపిలో కొనసాగడం విషయంలో పురందేశ్వరి ఆ ఇద్దరు మహిళ నేతలకంటే వెనుకబడ్డారు. మరి బిజెపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.