Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. మరి అలాంటి హీరోలకు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకపోయినా కూడా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక అదే విధంగా వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ సైతం తనదైన రీతిలో సినిమాలను చేసి భారీ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి సందర్భం లోనే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పటికీ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప నటుడితో చాలా మంది హీరోలు సైతం సినిమాలు చేయాలని కోరుకుంటూ అంటారు. అయితే ఆ అవకాశం వచ్చినా కూడా ఒక హీరో అతని సినిమాల్లో చేయనని తప్పుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ…
పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా డాలీ డైరెక్షన్ లో వచ్చిన ‘కాటమ రాయుడు’ సినిమాలో పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్రలో నటించమని విజయ్ దేవరకొండ కి ఒక మంచి ఆఫర్ వచ్చినప్పటికీ ఆయన అప్పుడు కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం ఒకటైతే, ఆ క్యారెక్టర్ కి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో విజయ్ ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసినట్టుగా కూడా పట్ల వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే పవర్ స్టార్ తో కనీసం ఒక్క సినిమాలో లేదంటే ఒక్క సీన్ లో అయిన నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా వేళ విజయ్ కి వచ్చిన అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవడంతో ఆయన అభిమానులు కూడా చాలా వరకు తీవ్రమైన నిరాశ చెందారు.
ఇక మొత్తానికైతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాడు. ఇక ఫ్యూచర్ లో ఆయన కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి… తను కూడా ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఎదుగుతున్నాడు కాబట్టి తనకి కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…