https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నాగ మణికంఠ చెప్పేవి మొత్తం అబద్దాలే ..ప్రూఫ్స్ ఇదిగో..బిగ్ బాస్ షో కోసం ఇంత దిగజారాలా?

ఎవరితో గొడవపడిన ఇతను ఆ గొడవ అంశాన్ని దాటి కేవలం తన ఫ్లాష్ బ్యాక్ తోనే మిగిలిన కంటెస్టెంట్స్ ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను నిన్న జరిగిన నామినేషన్స్ లో ఎమోషనల్ అవ్వడం చూసి, ఈ కుర్రాడు ఎమోషనల్ గా బాగా వీక్ గా ఉన్నాడే, ఇలాంటోళ్లని హౌస్ లోకి ఎలా రానిచ్చారు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 04:33 PM IST
    Bigg Boss 8 Telugu(18)

    Bigg Boss 8 Telugu(18)

    Follow us on

    Bigg Boss 8 Telugu: కష్టాలు లేని మనిషంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, ఎంతో మంది రోగాలతో అవస్థ పడుతూ కదల్లేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ కష్టాలను మనం అనుభవిస్తున్నామా. ఒక్క గుడ్డివాడు తన ముఖం ని కూడా తాను చూసుకోలేదు, వాళ్ళకంటే మనం ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నామా?, లేదు కదా ?, కాబట్టి బిగ్ బాస్ వంటి రియాలిటీ గేమ్స్ లోకి ఒక కంటెస్టెంట్ అడుగుపెట్టాలంటే తన వ్యక్తిగత సమస్యలను మొత్తం ఇంటి దగ్గరే వదిలేసి లోపలకు రావాలి. బిగ్ బాస్ సీజన్స్ లో పల్లవి ప్రశాంత్ తప్ప, సెంటిమెంట్ ని తెచ్చగొట్టి టైటిల్ ని గెలుచుకున్న కంటెస్టెంట్ ఒక్కరు కూడా లేరు. ఇప్పటి పల్లవి ప్రశాంత్ ని మించిపోయాడు ఈ సీజన్ కంటెస్టెంట్ నాగ మణికంఠ. ఇతను ప్రతీ కష్టమైన సమయంలో తన సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్ తోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నాడు.

    ఎవరితో గొడవపడిన ఇతను ఆ గొడవ అంశాన్ని దాటి కేవలం తన ఫ్లాష్ బ్యాక్ తోనే మిగిలిన కంటెస్టెంట్స్ ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను నిన్న జరిగిన నామినేషన్స్ లో ఎమోషనల్ అవ్వడం చూసి, ఈ కుర్రాడు ఎమోషనల్ గా బాగా వీక్ గా ఉన్నాడే, ఇలాంటోళ్లని హౌస్ లోకి ఎలా రానిచ్చారు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే ఇతనిది నిజమైన ఎమోషనల్ స్టోరీ కాదని కొన్ని ఆధారాలు చూస్తే అర్థం అవుతుంది. నిన్న జరిగిన నామినేషన్ లో ‘నా తల్లి చనిపోతే ఆమెకి అంత్యక్రియలు చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కట్టే కట్టే కోసం ఎంతోమందిని డబ్బులు అడుక్కొని ఆమెకి దహన సంస్కారాలు చేశాను’ అని అన్నాడు. ఈ మాటలకు కంటెస్టెంట్స్ మొత్తం ఏడ్చేశారు, అతన్ని నామినేషన్ చేసే కంటెస్టెంట్స్ కూడా అతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ విని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే నాగ మణికంఠ చెప్పిన వాటిల్లో నూటికి 90 శాతం కరెక్టే కానీ, తన తల్లి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు అనడం అతని కల్పించి చెప్పినవే.

    ఎందుకంటే రీసెంట్ గానే ఆయన తన తండ్రి, చెల్లి తో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నాగ మణికంఠ అంత్యక్రియలను అతని తండ్రి దగ్గరుండి చేయించాడని పరిశీలనలో తేలింది. అంతే కాదు నాగ మణికంఠ చెల్లి కూడా అతను కావాలని సానుభూతి గేమ్స్ ఆడుతున్నాడని, మా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనేది అతని నిర్ణయమే అని చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్ళే ఇలా చెప్పడం నాగ మణికంఠ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ ఇంత నెగటివ్ అవుతున్నా కూడా సోషల్ మీడియా లో అతని ఓటింగ్ మిగిలిన కంటెస్టెంట్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన మణికంఠ విష్ణు ప్రియా తర్వాతి స్థానం లో కొనసాగుతున్నాడు.