Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి స్టార్ హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఆయన ఒక్కసారి బ్రేక్ డాన్స్ చేశాడు అంటే ఆ సినిమా రికార్డుల మోత మోగాల్సిందే, అలాగే ఆయన ఒక్క డైలాగ్ చెప్పాడంటే ప్రేక్షకులందరూ చొక్కాలు చించుకొని మరి ఆ సినిమాను చూడటానికి ఎగబడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి పొటెన్షియాలిటీ ఏంటో సినిమా ఇండస్ట్రీకి బాగా తెలుసు…ఆయన ఎన్నోసార్లు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ఒక సినిమా డిజాస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ చిరంజీవిని తప్పు పట్టినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే అది ఏ సినిమా అంటే దాసరి నారాయణరావు వందో సినిమాగా తెరకెక్కిన లంకేశ్వరుడు…ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దానివల్లే చిరంజీవికి దాసరి నారాయణరావుకు మధ్య కొన్ని తగాదాలు కూడా వచ్చినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
అయితే ఈ సినిమాని తను 100% ఎఫర్ట్ తీశానని, కాకపోతే చిరంజీవి స్టార్ డమ్ వల్లే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందని అప్పట్లో దాసరి నారాయణరావు చిరంజీవి ని పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడడం సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వకపోవడంతో ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో సూపర్ డూపర్ సక్సెస్ లను కొడుతున్న సమయంలో లంకేశ్వరుడు సినిమా వచ్చి ఆయన మార్కెట్ ని కొద్ది వరకు తగ్గించిందనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే తన కెరియర్ లో చాలా ఎదురు దెబ్బలను తిన్న చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన విశ్వం భర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో కూడా తను చాలా బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తుంది…