Renu Desai Second Husband: ‘రేణు దేశాయ్’ రెండో భర్త ఎవరు ? ఎందుకు కనిపించడం లేదు ?

Renu Desai Second Husband: ‘పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి’ రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ మధ్య బాగా హడావుడి చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసి అతని ఫోటోను కూడా రేణు పోస్ట్ చేసింది. పైగా ఆ ఫోటోతో పాటు అతడి చేతికి తాను తొడిగిన రింగ్ ను చూపిస్తూ మరో ఫోటో కూడా జత చేసింది. ఇంత చేసి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అసలు […]

Written By: Shiva, Updated On : May 29, 2022 11:24 am
Follow us on

Renu Desai Second Husband: ‘పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి’ రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఆ మధ్య బాగా హడావుడి చేసింది. తనకు కాబోయే రెండో భర్త ఫేస్ ను దాచేసి అతని ఫోటోను కూడా రేణు పోస్ట్ చేసింది. పైగా ఆ ఫోటోతో పాటు అతడి చేతికి తాను తొడిగిన రింగ్ ను చూపిస్తూ మరో ఫోటో కూడా జత చేసింది. ఇంత చేసి, ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అసలు ఇంతకీ రేణు రెండో పెళ్లి చేసుకుందా ? లేదా ? ఇప్పటికీ రేణు మాత్రం తన రెండో పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Renu Desai

గ‌తేడాది సరదాగా ఆలీతో షోకి వచ్చింది రేణుదేశాయ్. ఆ షోలో మాత్రం తన రెండో భర్త గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చింది. తన కొత్త భర్త ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌ అని, గతంలో అమెరికాలో జాబ్ చేసేవాడని, తన తండ్రికి ఆరోగ్యం స‌రిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో జాబ్ చేస్తున్నాడని రేణు చెప్పుకొచ్చింది. కానీ, అతన్ని పెళ్లి చేసుకుందా ? లేదా ? అని మాత్రం చెప్పలేదు.

Also Read: Akkineni Akhil Agent: ఏజెంట్ కొత్త లుక్ కేక.. కొత్త గెటప్ లో ‘అక్కినేని అఖిల్’ రచ్చ రచ్చే

ఆ తర్వాత, మరో ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు ఆలోచన చేశానని… అయితే తన సంతోషం కోసం, తన పిల్లల కోసం తాను రెండో పెళ్లి చేసుకోక త‌ప్ప‌డం లేదని చెప్పింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణు రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించి షాక్ ఇచ్చాడు. అతగాడు రేణును ఆకాశానికి ఎత్తేశాడు. రేణు వల్లే తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని అతను మెచ్చుకున్నాడు.

Renu Desai

ఐతే, ఆ తర్వాత వీరి పెళ్లి పై ఎలాంటి క్లారిటీ లేదు. వీరి ఎంగేజ్మెంట్ జరిగి కూడా రెండేళ్లు అయింది. ఇప్పటివరకు రేణు దేశాయ్ తన రెండో భర్త గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు అతను ఎవరు ? ఎక్కడ ఉంటాడు ? లాంటి విషయాల పై ఎవ్వరికి క్లారిటీ లేదు. అసలు ఆమె రెండో పెళ్లి చేసుకుందా ? లేదా ? అనే విషయం పై కూడా స్పష్టత లేదు.

అయితే, రేణు దేశాయ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె రెండో పెళ్లి చేసుకుంది. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంది అని తెలిస్తే.. పవన్ అభిమానులు రెచ్చిపోతారు కాబట్టి.. ఆమె ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతుందట. అలాగే పిచ్చి అభిమానంతో తన రెండో భర్తకు పవన్ ఫ్యాన్స్ ఎలాంటి ఇబ్బంది కలిగిస్తారో అని రేణు దేశాయ్ భయపడుతుందట. ప్రస్తుతానికి అయితే, రేణు దేశాయ్ రెండో భర్త ఆమెతోనే కలిసి ఉంటున్నాడు.

Also Read:Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం

Tags