https://oktelugu.com/

Telangana Govt- Salaries: మోడీ దెబ్బకు.. తెలంగాణ దివాళా.. ఈనెల జీతాలివ్వడం కష్టమేనా?

Telangana Govt- Salaries: కేంద్రంలో అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు. అలివి కానీ హామీలిచ్చి అప్పుల కుప్పలు చేసుకున్న రాష్ట్రాలను ఆడించవచ్చు. ఇప్పుడు తోకజాడిస్తున్న కేసీఆర్ మెడకు ఉచ్చు బిగించే పనిలో కేంద్రం రెడీగా ఉంది. ఈనెల జీతాల కోసం అప్పులకు వచ్చిన తెలంగాణ సర్కార్ కు కేంద్రం నిర్విద్వంగా నో చెబుతోంది. ఆర్బీఐ నుంచి.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటోంది. దీంతో ఈ జూన్ నెలలో ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక […]

Written By:
  • NARESH
  • , Updated On : May 29, 2022 / 11:19 AM IST
    Follow us on

    Telangana Govt- Salaries: కేంద్రంలో అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు. అలివి కానీ హామీలిచ్చి అప్పుల కుప్పలు చేసుకున్న రాష్ట్రాలను ఆడించవచ్చు. ఇప్పుడు తోకజాడిస్తున్న కేసీఆర్ మెడకు ఉచ్చు బిగించే పనిలో కేంద్రం రెడీగా ఉంది. ఈనెల జీతాల కోసం అప్పులకు వచ్చిన తెలంగాణ సర్కార్ కు కేంద్రం నిర్విద్వంగా నో చెబుతోంది. ఆర్బీఐ నుంచి.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటోంది. దీంతో ఈ జూన్ నెలలో ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలో తెలియక కేసీఆర్ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోందట.. ఈ మేరకు అధికార వర్గాల నుంచి వస్తున్న లీకులు ఉద్యోగులను కలవరపెడుతున్నాయి.

    modi, kcr

    ఇప్పటికే పోయిన నెలలో తెలంగాణలో పెన్షన్లు లేట్ అయ్యాయి. జీతాలను రోజుకొక జిల్లా చొప్పున వేస్తూ 14వ తేదీ వరకూ లాక్కువచ్చారు. కరోనా తర్వాత తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడం.. రైతుబంధు, దళితబంధు సహా పథకాలకు డబ్బులు పంచడంతో ఇప్పుడు అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జూన్ రైతుబంధును రైతులందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఆరువేల కోట్లు అవసరం. ఇక జూన్ నెలలో జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.3వేల కోట్లు ఇవ్వాలి. వీటన్నింటికి తెలంగాణ సర్కార్ వద్ద డబ్బులు లేవు. దీంతో అప్పుల కోసం ఢిల్లీకి, ఇతర ఆర్థిక సంస్థల వద్దకు తెలంగాణ అధికారులు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది.

    Also Read: Emergency in India- Modi: ఎమర్జెన్సీ కాలంలో సర్దారుగా అవతారమెత్తిన ప్రధాని మోదీ

    ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క రూపాయి అప్పు పుట్టకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ చక్రం తిప్పుతోంది. జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ రాజకీయాలు చేయడం.. మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుండడంతో కేసీఆర్ కు అప్పు పుట్టకుండా ఆర్థిక దిగ్గంధనం చేస్తూ మోడీ సర్కార్ చోద్యం చూస్తోంది.

    ఇప్పటివరకూ అప్పులతో ఎలాగోలా రాష్ట్ర ఆర్థిక స్తితిని లాక్కొచ్చిన కేసీఆర్ కు ఈ జూన్ నెలలో తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి. ఈ వారం ఖచ్చితంగా జీతాలు, పెన్షన్ల కోసం మూడు వేల కోట్ల అప్పు కావాలి. అందుకే అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్రం, ఆర్బీఐ ఇతర సంస్థలను బతిమిలాడుతున్నారు. కానీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడంతో కేంద్రం కొర్రీలు పెడుతూ రూపాయి అప్పు ఇప్పించడం లేదు. దీంతో జీతాల కోసం ఈనెల కేసీఆర్ సార్ ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

    KCR

    ఈనెలలోనే రైతులకు రైతుబంధు అమలు చేయాలి. వారి ఖాతాలో 6వేల కోట్లు వేయాలి. ఇక జీతాలకు మరో 3వేల కోట్లు.. దీంతో ఆర్బీఐని కోరినా కూడా తెలంగాణకు ఇవ్వడం లేదట.. కేంద్రం కూడా అప్పులకు అనుమతులు ఇవ్వడం లేదు.

    ఇక ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా అడగగానే కేంద్రం అప్పులు మంజూరు చేస్తోంది. ఆర్బీఐ ఇతర సంస్థల నుంచి అనుమతులు ఇస్తోంది. కానీ తెలంగాణ మొత్తం క్లారిటీగా లెక్కలు అప్పజెప్పినా కూడా రూపాయి విదిల్చడం లేదు. ఎందుకంటే జగన్ అక్కడ మోడీ సర్కార్ తో స్నేహంగా ఉంటుండగా.. కేసీఆర్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కేంద్రం కావాలనే తెలంగాణపై కక్ష సాధిస్తోందని టీఆర్ఎస్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కానీ ఎక్కడా మోడీపై, కేంద్రంపై నోరెత్తడం లేదు. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే అప్పులు ఇవ్వరని మిన్నకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి కేసీఆర్ ఎలా బయటపడుతాడు? ఈనెల జీతాలు ఎలా చెల్లిస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.

    Also Read:Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం

    Tags