https://oktelugu.com/

Pushpa Part-2: ‘పుష్ప 2’లో వారిద్దరి సీన్సే హైలైట్.. ఆ రెండు సినిమాలనే ఫాలో అవుతున్న సుక్కు !

Pushpa Part-2: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలోనే రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. మరి ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా భారీగా ఉండాలి కదా. ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ కోసం ఏం చేయనున్నారు ? ఇప్పుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : May 29, 2022 / 11:30 AM IST
    Follow us on

    Pushpa Part-2: ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా, పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలోనే రిలీజ్ అయింది. పైగా ఆ రేంజ్ సక్సెస్ ను అందుకుంది. మరి ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా భారీగా ఉండాలి కదా. ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ కోసం ఏం చేయనున్నారు ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ‘పుష్ప 2’ పై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ మీ కోసం.

    Pushpa Part-2

    ‘పుష్ప 2’ కోసం సుక్కు పాన్‌ ఇండియా ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నాడు. గతంలో వచ్చిన బాహుబలి సినిమాలోనూ, అలాగే రీసెంట్‌ గా వచ్చిన కేజీయఫ్‌-2లోనూ ఒక ఫార్ములా ఉంటుంది. పార్ట్ 2 లో హీరో కి విలన్‌ కి మధ్య భారీ వార్‌ జరుగుతుంది. ఈ వార్ సినిమా మొత్తంలోనే అద్భుతంగా ఉంటుంది. ఈ వార్ తోనే ‘బాహుబలి, కేజీఎఫ్ 2’ సినిమాలు భారీగా సక్సెస్ అయ్యాయి కూడా.

    Also Read: Renu Desai Second Husband: ‘రేణు దేశాయ్’ రెండో భర్త ఎవరు ? ఎందుకు కనిపించడం లేదు ?

    అందుకే, సుకుమార్ కూడా ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. ఈ క్రమంలోనే పుష్ప2లో ‘అల్లు అర్జున్‌ – ఫాహద్‌ ఫాజిల్‌’ మధ్య భారీ వార్ సీక్వెన్స్ ను పెడుతున్నాడు. ఈ వార్ సీన్లు సినిమాకే మెయిన్ హైలైట్‌ గా నిలుస్తాయట. మొత్తానికి పుష్ప 1 కంటే పుష్ప 2లో యాక్షన్ ను ఫుల్ పెట్టాడుతున్నాడు సుక్కు.

    Pushpa Part-2

    కాకపోతే, భారీ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే, పుష్ప టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏది ఏమైనా పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకుంది. అందుకే, పార్ట్ 2 పై రెట్టింపు ఆసక్తి కలిగింది. అందుకే, పార్ట్ 2 పై భారీ ఒత్తిడి ఉంటుంది. ఎలాగూ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది.

    అన్నట్టు పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో మరో 3 కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. అలాగే పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.

    Also Read:Emergency in India- Modi: ఎమర్జెన్సీ కాలంలో సర్దారుగా అవతారమెత్తిన ప్రధాని మోదీ

    Tags