https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 లో అసలైన విలన్ ఎవరో తెలిసిపోయింది..?

Bharateeyudu 2: శంకర్ ఎప్పటిలాగే టెక్నాలజీని వాడుతూ దేశంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 27, 2024 / 11:10 AM IST

    Who is the real villain in Bharateeyadu 2

    Follow us on

    Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అందరికంటే ముందే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్.. ప్రస్తుతం ఈయన భారతీయుడు 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేసినప్పటికీ దానికి విశేషమైన స్పందన వస్తుంది.

    ఇక శంకర్ ఎప్పటిలాగే టెక్నాలజీని వాడుతూ దేశంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానిమీద పలు రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారట. అది కూడా విలన్ పాత్ర కావడం విశేషం…

    Also Read: Kalki 2898 AD: మహా భారతం ఎండింగ్ కి కలియుగం బిగినింగ్ కి లింక్.. కల్కిలో మైండ్ బ్లోయింగ్ చేసిన నాగ్ అశ్విన్…

    ఇక ఆయన ఈ సినిమాలో రెండే రెండు సీన్లలో కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అందులో ఆయన విలనిజాన్ని భారీ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఆ సీన్లని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సిద్ధార్థ్ కమలహాసన్ మధ్య జరిగే కొన్ని సీన్లు కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఉన్నాడు అనే వార్తని సినిమా యూనిట్ ఇంకా అఫీషియల్ గా అయితే తెలియజేయలేదు. ఎందుకు అంటే అదొక సస్పెన్స్ తో కూడిన క్యారెక్టర్ అట వాళ్లు ఈ క్యారెక్టర్ ని చాలా హోల్డ్ చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది.

    Also Read: Kalki 2898 AD: కల్కి లో ప్రభాస్ పాత్ర ఆ మూవీ లో ఎన్టీయార్ పాత్ర లా ఉందే…

    ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అనే వార్త తెలిసిన వెంటనే అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మధ్య విజయ్ సేతుపతి చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. కాబట్టి సెంటిమెంట్ ప్రకారం చూసుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ కమలహాసన్, శంకర్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…