Kalki 2898 AD: మహా భారతం ఎండింగ్ కి కలియుగం బిగినింగ్ కి లింక్.. కల్కిలో మైండ్ బ్లోయింగ్ చేసిన నాగ్ అశ్విన్…

ప్రభాస్ ఈ సినిమాలో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. అలాగే నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 10:08 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. మొదటి షో తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా చాలా సంతోషపడుతున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. అలాగే నాగ్ అశ్విన్ విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ గుర్తింపు అయితే దక్కుతుంది. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీని మహాభారతం కథ ఆధారంగా తీసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇందులో నాగ్ అశ్విన్ ఫిక్షన్ స్టోరీని జోడిస్తూ మహా భారతం లో కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత కలియుగానికి లింక్ చేస్తూ ఆయన రాసుకున్న ఫిక్షన్ స్టోరీ బాగుంది. నాగ్ అశ్విన్ స్టోరీ పట్ల క్లియర్ గా ఉండటంవల్ల ఈ సినిమా అనేది ఈ రేంజ్ లో ఎలివేట్ అయిందనే చెప్పాలి. ఇక స్టోరీ పరం గా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి కూడా రీచ్ అయింది.

ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఏమాత్రం హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉంది. ఇక ద్వాపర యుగం నుంచి కలియుగానికి ఆయన చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇంక కథ పరంగా కూడా క్లియర్ కట్ గా ఉండడం వల్లే ఈ సినిమా అభిమానులు పెట్టుకున్న అంచనాలను చేరుకోగలిగింది…అందుకే ఈ సినిమాకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందో చూడాలి…