https://oktelugu.com/

Kalki Movie: కల్కి సినిమాలో రాంగోపాల్ వర్మ… ఆయన పాత్ర ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..?

Kalki Movie: మొత్తానికైతే వర్మలో ఉన్న యాక్టర్ ని కూడా మనకు పరిచయం చేశారంటు వర్మ అభిమానులు కల్కి సినిమా యూనిట్ మీద పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 27, 2024 / 11:05 AM IST

    RGV-in-Kalki-Movie

    Follow us on

    Kalki Movie: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కల్కి. ఇక ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా ఎలాగైనా సరే భారీ రికార్డులను కొడుతుంది అంటూ ఇప్పటికే ట్రేడ్ పండితులు ఒక భారీ అంచనకి వచ్చారు.

    ఇక ఈ సినిమాలో చాలామంది క్యామియో రోల్స్ పోషించారనే విషయం మనకు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సంచలన దర్శకుడి గా పేరు సంపాదించుకున్న ‘రామ్ గోపాల్ వర్మ’ కూడా ఒక క్యారెక్టర్ లో కనిపించారట. మరి ఈ క్యారెక్టర్ ఏంటి అంటే ఈ సినిమాలో ఒక బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ లో వర్మ నటించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు వర్మ ఏ సినిమాలోను అంత పెద్దగా క్యారెక్టర్ లో అయితే కనిపించలేదు. అలా వచ్చి పోయే క్యారెక్టర్లు చేశాడు కానీ ఈ సినిమాలో మాత్రం కొన్ని డైలాగ్ లు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక వర్మ డైలాగులు చెబుతుంటే థియేటర్ లో ప్రేక్షకులు అరుస్తూ విజిల్స్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది.

    Also Read: Kalki 2898 AD: మహా భారతం ఎండింగ్ కి కలియుగం బిగినింగ్ కి లింక్.. కల్కిలో మైండ్ బ్లోయింగ్ చేసిన నాగ్ అశ్విన్…

    ఇక మొత్తానికైతే వర్మలో ఉన్న యాక్టర్ ని కూడా మనకు పరిచయం చేశారంటు వర్మ అభిమానులు కల్కి సినిమా యూనిట్ మీద పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం రామ్ గోపాల్ వర్మ గురించే చర్చ జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో నాగ్ అశ్విన్ చాలా రికార్డులను బ్రేక్ చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

    Also Read: Kalki 2898 AD: కల్కి లో ప్రభాస్ పాత్ర ఆ మూవీ లో ఎన్టీయార్ పాత్ర లా ఉందే…

    ఇక ఆ రికార్డులను కనక బ్రేక్ చేసినట్లయితే రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ కూడా మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటాడు. ఇక బాహుబలి 2 రెండువేల కోట్ల వరకు కలెక్షన్స్ రాబెట్టింది. మరి ఇప్పుడు కల్కి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాహుబలి రికార్డును బ్రేక్ చేసేలానే కనిపిస్తుంది. కల్కి సినిమా వందల కోట్లను కలెక్ట్ చేస్తుందనే దాని మీద ఒక వారం రోజులు గడిస్తే కానీ సరైన క్లారిటీ అయితే రాదు…