Hollywood: మన ఇండియన్స్ సైతం హాలీవుడ్ సినిమాలు చూసేలా చేసిన ఒకే ఒక డైరెక్టర్ ఎవరంటే..?

Hollywood: ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో 1989 లో వచ్చిన 'ఇండియానా జోన్స్ లాస్ట్ క్రూసేడ్' అలాగే 1993 లో వచ్చిన 'జురాసిక్ పార్క్' ఈ రెండు సినిమాలను...

Written By: Gopi, Updated On : June 26, 2024 10:30 am

steven spielberg

Follow us on

Hollywood: హాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ లో ‘స్టీవెన్ స్పిల్ బర్గ్ ‘ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఈయన తీసిన అన్ని సినిమాలు ఓకేత్తైతే ఒక రెండు సినిమాలు మాత్రం రెండు సినిమాలు మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ఆ సినిమా లా ఇన్స్పిరేషన్ తో వివిధ భాషల్లో విపరీతమైన సినిమాలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో 1989 లో వచ్చిన ‘ఇండియానా జోన్స్ లాస్ట్ క్రూసేడ్’ అలాగే 1993 లో వచ్చిన ‘జురాసిక్ పార్క్’ ఈ రెండు సినిమాలను మనం ఇప్పుడు చూసిన అందులో ఉన్న కంటెంట్ కానీ అందులో ఉన్న విజువల్స్ కానీ అది చూస్తున్నప్పుడు మనం పొందుతున్న అనుభూతి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే చెప్పాలి…ఇక వీటిని బేస్ చేసుకొని తెలుగులో విపరీతమైన సినిమాలు వచ్చాయి. 2000 దశకంలో తెలుగులో వచ్చిన చాలా సినిమాలను ఈ సినిమా రిఫరెన్స్ నుంచే తీసుకొని రాశారు.

Also Read: Shankar Bharateeyudu 2: శంకర్ భారతీయుడు 2 కోసం అనిరుధ్ ను తీసుకొని తప్పు చేశాడా..?

ఇక మరికొన్ని సినిమాల్లో అయితే మక్కికి మక్కి సీన్స్ ను కూడా దింపేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే స్పీల్ బర్గ్ ఈ సినిమాలను తన మేధో శక్తితో ఆలోచించి దానికి అద్భుతమైన విజువల్స్ ను ఆడ్ చేసి ఆ సినిమాను నెక్స్ట్ లెవెలోకి తీసుకెళ్ళారు. ఇక అందులో నిజం సీన్ ఏదో గ్రాఫిక్స్ సీన్ ఏదో అసలు తెలియడానికి వీలు లేకుండా ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరి ఈ సినిమాలను చేశాడు.

Also Read: Allu Arjun: పవన్ కళ్యాణ్ ను కలువబోతున్న అల్లు అర్జున్… డీల్ సెట్ చేసిన టాప్ ప్రొడ్యూసర్…

ఇక డైనోసర్ల మీద సాగే ‘జురాసిక్ పార్క్’ సినిమా అయితే ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమాలో ఇండియాలో వచ్చిన ది బెస్ట్ హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా అప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా వసూల్ చేయలేని కలెక్షన్స్ ని రాబట్టి హాలీవుడ్ సినిమా సత్తా ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొకసారి తెలియజేసింది. ఇక అప్పటినుంచి మన ఆడియెన్స్ లో చాలామంది హాలీవుడ్ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు…