Varahi Deeksha: వారాహి దీక్ష కథ ఏంటి? పవన్ ఎందుకు చేపడుతున్నారు?

తాజాగా పవన్ వారాహి దీక్షకు దిగడంతో.. మరోసారి చర్చికి దారి తీసింది. వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్త మాతృకలుగా చెప్తారు. ఆమె ఏడు ప్రతి రూపాలను సప్తమాతృకలు అంటారు.

Written By: Dharma, Updated On : June 26, 2024 10:26 am

Varahi Deeksha

Follow us on

Varahi Deeksha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. జూన్ 26 నుంచి 11 రోజులు పాటు ఈ దీక్షలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి దీక్షపై బలమైన చర్చి నడుస్తోంది. అసలు ఈ దీక్ష ఎందుకు చేస్తారు? చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తన ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టారు పవన్. అప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ వాహనం పెద్ద సంచలనమే రేపింది.

ఇప్పుడు తాజాగా పవన్ వారాహి దీక్షకు దిగడంతో.. మరోసారి చర్చికి దారి తీసింది. వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్త మాతృకలుగా చెప్తారు. ఆమె ఏడు ప్రతి రూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గా దేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్త బీజుడు, అంధకాసురుడు,శంభుని శంభు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలి వారాహి అమ్మవారిని పురాణాల్లో చెబుతారు.

వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి ఎనిమిది చేతుల్లోనూ శంఖువు, చక్రం,నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాల్లో చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారి గురించి, విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్.

వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించడానికి. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదు. అంతేకాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి కంట్రోల్ చేసుకునేందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు. ఏటా జేష్ట మాసం చివరిలో.. ఆషాడమాసం మొదటిలో ఆచరిస్తారు. సాత్విక ఆహారంతో పాటు నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. గతంలో సైతం పవన్ వారాహి దీక్ష చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి అధికారంలోకి రావడంతో పాలన సజావుగా సాగాలని ఈ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.