Sudev Nair Wife: ఈమధ్య కాలం లో వరుస సినిమాలతో బాగా బిజీ అయిపోయిన నటుడు సుదేవ్ నాయర్(Sudev Nair). గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిల్చిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం లో ‘జిమ్మీ’ అనే విలన్ క్యారెక్టర్ ద్వారా ఇతను మంచి పాపులారిటీ , క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఇతని నటనకు ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు ముందు అనేక సినిమాల్లో ఆయన విలన్ గా చేసాడు కానీ, ఓజీ మూవీ తెచ్చి పెట్టిన క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సేపు కనిపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని సుదేవ్ నాయర్ నడిపించాడు అని చెప్పొచ్చు, ఆ రేంజ్ క్యారెక్టర్ పడింది.
ఇక ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో కూడా సుదేవ్ నాయర్ విలన్ గా నటించాడు. ఇందులో కూడా ఆయన క్యారెక్టర్ చాలా బాగా పండింది. వారం రోజుల్లో 220 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రాబోయే రోజుల్లో 300 కోట్ల గ్రాస్ ని అందుకోబోతోంది. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ చిత్రాల్లో మంచి విలన్ క్యారెక్టర్స్ చేసి వాళ్ళిద్దరి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో కీలక భాగం అయ్యి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి బాగా దగ్గరయ్యాడు సుదేవ్ నాయర్. కేరళ ప్రాంతానికి చెందిన ఈ నటుడి కెరీర్ హీరో గానే మొదలైంది. మలయాళం లో కొన్ని సినిమాల్లో హీరో గా నటించిన తర్వాత, మన టాలీవుడ్ నుండి విలన్ రోల్ రావడం, ఒకటి క్లిక్ అవ్వడం తో వరుసగా అదే తరహా క్యారెక్టర్స్ రావడంతో ఇక్కడే స్థిరపడ్డాడు.
ఇకపోతే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సుదేవ్ నాయర్, ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆయనకు అమర్ దీప్ కౌర్ స్యాన్ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈమె ఒక పాపులర్ మోడల్, మలయాళం లో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ సమయం లోనే సుదేవ్ నాయర్ తో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం కాస్త స్నేహం గా మారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం వరకు వెళ్ళింది. చూసేందుకు నేటి తరం యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోయిని అందం తో ఉన్నటువంటి సుదేవ్ భార్య అమర్ దీప్ కౌర్ కి సంబంధించిన ఫోటోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
