https://oktelugu.com/

‘ఆదిపురుష్’లో ప్రభాస్ జోడీగా ఎవరంటే?

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ కాగా దానిని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలనే చేస్తున్నాడు. ‘సాహో’తో ఉత్తరాధి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. Also Read: గురువుని కలసిన మెగాస్టార్.! ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలోనూ.. బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 / 06:41 PM IST
    Follow us on

    యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ కాగా దానిని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలనే చేస్తున్నాడు. ‘సాహో’తో ఉత్తరాధి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు.

    Also Read: గురువుని కలసిన మెగాస్టార్.!

    ఈ మూవీ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలోనూ.. బాలీవుడ్ దర్శకుడు ఓంరావత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. ఈ మూవీ ఒకేసారి తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఆదిపురుష్’ చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ అంచనాలను పెంచేస్తోంది.

    ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’గా నటిస్తున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ ఫస్టు లుక్.. రావణుడికి సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రభాస్ కు జోడీగా ‘సీత’ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా తాజాగా మరోపైకి బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.

    Also Read: లాక్డౌన్ పై ‘ఫేస్ బుక్’ లఘ చిత్రం.. కన్నీరు పెట్టిస్తోంది..!

    ‘ఆదిపురుష్’లో సీత పాత్రలో అనన్య పాండే నటిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అనన్య పాండే ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీలో నటిస్తోంది. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తోంది. ‘ఆదిపురుష్’లో సీత క్యారెక్టర్ కోసం చిత్రయూనిట్ ఆమెను సంప్రదిస్తున్నారనే గాసిప్ విన్పిస్తోంది.

    ఇప్పటికే సీత పాత్ర కోసం అనుష్క శర్మ.. కీర్తి సురేష్.. కృతిసనన్.. కియారా అడ్వాణీ పేర్లు విన్పించగా తాజాగా అనన్య పాండే పేరు విన్పిస్తోంది. వీరిలో ఏ హీరోయిన్ ప్రభాస్ కు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ‘ఆదిపురుష్’ షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుండగా 2022లో రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్