సరిహద్దుల్లో మోదీ.. జవాన్లతో కలిసి దీపావళి సంబురాలు..!

2014లో భారత ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ప్రతీ దీపావళిని మోదీ జవాళ్లను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నేడు దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ జవాన్లతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నవేళ ప్రధాని మోదీ జవాళ్లతో దీపావళి వేడుకలు జరుపుకోవడం విశేషం. Also Read: టీ అమ్మిన వ్యక్తి.. మోడీపై ఒబామా ప్రశంసల జల్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ ట్యాంక్ పై పయనించి జవాన్లకు ప్రభుత్వం […]

Written By: NARESH, Updated On : November 14, 2020 8:19 pm
Follow us on

2014లో భారత ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ప్రతీ దీపావళిని మోదీ జవాళ్లను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నేడు దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ జవాన్లతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నవేళ ప్రధాని మోదీ జవాళ్లతో దీపావళి వేడుకలు జరుపుకోవడం విశేషం.

Also Read: టీ అమ్మిన వ్యక్తి.. మోడీపై ఒబామా ప్రశంసల జల్లు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ ట్యాంక్ పై పయనించి జవాన్లకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాన్ని పంపించారు. మోదీ యుద్ధ ట్యాంకుపై పయనించిన ఫొటోను బీజేపీ అధికార ట్వీటర్లో పోస్టు చేసింది. దీంతో మోదీ యుద్ధ ట్యాంకుపై పయనిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నేటి ఉదయమే రాజస్థాన్లోని జైసల్మేర్ కు వెళ్లాడు. అక్కడి లోంగేవాలా పోస్టులోని జవాన్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లకు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపేలా ప్రసంగించారు.

Also Read: దేశంలో.. తెలంగాణలో ‘హస్త’ వ్యస్తం

సరిహద్దుల నుంచే భారత శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు పంపించారు. దేశ భద్రత.. ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడబోదనే సందేశాన్ని పంపించారు. మోదీ జవాన్లతో దీపావళి జరుపుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్