Chiranjeevi- Allu Aravind : ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్న చిరంజీవికి ఉండే స్థానం స్థాయి వేరే లెవల్ అనే చెప్పాలి… ఇక చిరంజీవి(Chiranjeevi)ని ఎవరైనా దూషించిన కూడా వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తి కావడం నిజంగా అతనికి చాలా ప్లస్ అయింది. తనని తిట్టినవారి సైతం వాళ్ళింట్లో ఫంక్షన్స్ అయితే చిరంజీవిని రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు బాగుండాలని దీవించి వచ్చిన గొప్ప మనసున్న మహారాజు చిరంజీవి…అందుకే ఆయనకి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు…ఇక ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘లైలా’ (Laila) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి మాట్లాడుతూ తం కుటుంబ్ సభ్యుడు అయిన అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ హిట్ అందుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ చిరంజీవి మాట్లాడాడు. ఇక చిరంజీవి ఇలా మాట్లాడితే అల్లు అరవింద్ (Allu Aravind) రీసెంట్ గా ‘తండేల్ ‘ (Thandel) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజుని ఉద్దేశిస్తూ ఈ సంక్రాంతికి ఒక సినిమాని డౌన్ చేసావ్, మరొక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించావు. అలాగే ఐటీ రైడ్స్ జరిగితే వాళ్లకి ఏమి దొరక్కకుండా ప్లాన్ చేశావు అంటూ ఆయన్ని కించపరుస్తూ గేమ్ చేంజర్ సినిమా ని తక్కువ చేసి మాట్లాడాడు.
అలాగే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత పెద్దగా ఆడలేదు. దానివల్లే మగధీర సినిమా చేసి అతనికి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వాలని అనుకున్నాను అంటూ రామ్ చరణ్ చిరుత సినిమాను కూడా తక్కువ చేసి మాట్లాడాడు.
ఇక దీంతో సోషల్ మీడియా మొత్తం మెగా అభిమానులు అతన్ని ట్రోల్ చేశారు. దాంతోపాటుగా చిరంజీవి అల్లు అర్జున్ గురించి చాలా గొప్పగా మాట్లాడితే అల్లు అరవింద్ మాత్రం తన మేనల్లుడు అయిన రామ్ చరణ్ గురించి తక్కువ చేసి మాట్లాడటం అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి ఉన్నత శిఖరం ముందు అల్లు అరవింద్ అనేవాడు ఒక చిన్న రాయి లాంటి వ్యక్తి అంటూ అతన్ని హేళన చేస్తున్నారు.
ఇక ఎట్టకేలకు దిగివచ్చిన అల్లు అరవింద్ రామ్ చరణ్ విషయంలో తన మాట్లాడింది తప్పని తన అల్లుడు తనకు కొడుకుతో సమానమని వివరణ ఇచ్చుకున్నాడు. నేను ఆ ఉద్దేశ్యంతో అప్పుడు అలా మాట్లాడలేదని ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పాడు. ఏది ఏమైనా కూడా అల్లు అరవింద్ చేసిన ఈ పనికి విమర్శలు అయితే మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…