Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు రాజకుమారుడు (Rajakumarudu)సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మొదటి సినిమాతోనే విజయాన్ని సాధించిన ఆయన ఆ తదుపరి సినిమాలతో కొంతవరకు డీలాపడ్డప్పటికీ మురారి, ఒక్కడు లాంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్లను సాధించాడు. ఇక ఈ సినిమాలు ఇచ్చిన స్టార్ డమ్ తో ఆయన స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకోవడం విశేషం… ఇక ఇదిలా ఉంటే తన తోటి హీరోలు రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే మహేష్ బాబు మాత్రం కెరియర్ మొదటి నుంచి కూడా రీమేక్ సినిమాలు చేయడానికి అసలు ఇష్టపడడు. ఎందుకంటే ఆల్రెడీ వేరే భాషలో ఒక హీరో సినిమా చేసిన తర్వాత మళ్లీ ఆ సినిమాను మనం చేస్తే ఆ హీరో ఎలాగైతే చేశాడో ఆయన తాలూకు యాక్టింగ్ మనలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటూ మహేష్ బాబు చాలా మెచ్యూర్డ్ గా ఆన్సర్ చెబుతూ ఉంటాడు. కానీ ఒక సినిమా విషయంలో ఆయన రీమేక్ చేయాలని అనుకున్నాడు.
తమిళ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న మురుగదాస్ (Murugadas) డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన కత్తి (Katthi) సినిమాని తెలుగులో మురుగదాస్ డైరెక్షన్ చేస్తే మహేష్ రీమేక్ చేస్తానని ఓపెన్ గా చెప్పాడు. కానీ అప్పటికే చిరంజీవి ఆ సినిమా రీమేక్ రైట్స్ ని తీసుకొని ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకోవాలని మహేష్ బాబు అనుకున్నాడు. అయినప్పటికి చిరంజీవి మాత్రం రైట్స్ తీసుకొని ఆ సినిమా ద్వారా మరోసారి సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవి వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత మహేష్ బాబు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే రాజమౌళి సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడిన కూడా రాజమౌళి తో సినిమా చేస్తే ఆయనకి మంచి ఇమేజ్ అయితే వస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే… అందుకోసమే మహేష్ బాబు కూడా విపరీతంగా కష్టపడడానికి రెడీ అయ్యాడు…