Homeఎంటర్టైన్మెంట్Mega vs Nandamuri: ఈ హీరోలు మెగా, నందమూరి ఈ రెండింటిలో ఏ కాంపౌండ్ కి...

Mega vs Nandamuri: ఈ హీరోలు మెగా, నందమూరి ఈ రెండింటిలో ఏ కాంపౌండ్ కి చెందినవారు..?

Mega vs Nandamuri: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ రెండు ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుండటం విశేషం… ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్ ఈ రెండింటిలో ఏ కాంపౌండ్లోకి చెందినవారు అంటూ ఇండస్ట్రీలో పలు సందర్భాల్లో చర్చలైతే తే జరుగుతుంటాయి. నిజానికి చిరంజీవి, బాలయ్య లాంటి నటులు సైతం ఇక్కడ మెగా, నందమూరి అనే కాంపౌండ్లు ఏమీ లేవని హీరోలందరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉందని చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య ఎప్పటికప్పుడు వైరం అనేది నడుస్తూనే ఉంటుంది. సినిమాలపరంగా పోటీ వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది…

ఇక శర్వానంద్, రవితేజ లాంటి నటులు మెగా కాంపౌండ్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. విశ్వక్ సేన్, అడవి శేషు, సిద్దు జొన్నల గడ్డ లాంటి నటులు నందమూరి బాలకృష్ణ సపోర్ట్ తో ముందుకు సాగుతున్నారు. కాబట్టి వాళ్లు నందమూరి కాంపౌండ్ కిందికి వస్తారు…

ఇలా ఇండస్ట్రీలో పలువురు కుర్ర హీరోలు వాళ్లకు గొప్ప అవకాశాలు రావడానికి ఇటు మెగా, అటు నందమూరి ఫ్యామిలీలతో చాలా సన్నిహిత్యంగా ఉంటున్నారు. దీనివల్ల వాళ్లకు మంచి అవకాశాలు రావడమే కాకుండా ఇండస్ట్రీలో ముందుకెళ్లడానికి కూడా అవకాశం దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఏ హీరో అయిన టాప్ హీరోగా మారాలి అనుకుంటే కథల విషయంలో వాళ్ళు తీసుకునే శ్రద్ధ, ఆ సినిమాను స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ మెయింటైన్ చేయాల్సి ఉంది. అంతే తప్ప ఎవరి కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా బాగాలేకపోతే ప్రేక్షకులు మాత్రం ఆదరించరు. కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్ మద్దతు ఉంటే టాక్ తో సంబంధం లేకుండా కొంతవరకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version