Pushpa 2 Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప ఫీవర్ ఎక్కువగా నడుస్తుంది. ఇక రిలీజ్ కి మరొక నాలుగు రోజులు సమయం మాత్రమే ఉన్న నేపధ్యం లో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైపైతే క్రియేట్ అవుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి సినిమా విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి కేర్ అయితే తీసుకుంటాడో ఈ సినిమాలో అంతకుమించి కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రతి ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా జరుపుకునే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ఈవెంట్ ను కూడా భారీ రేంజ్ లో జరపాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సుకుమార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాడనే విషయాల మీద కొంతమందికి సరైన క్లారిటీ అయితే రావడం లేదు. నిజానికి మొదటి పార్ట్ పుష్ప రాజ్ శ్రీవల్లి పెళ్లి చేసుకున్న సీన్ తో ఎండ్ అయిపోయింది. కాబట్టి అక్కడి నుంచే ఈ సినిమాని నడిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ సినిమాను ఎక్కడైతే ఎండ్ చేశాడో అక్కడి నుంచే స్టార్ట్ చేసి మొదట తన పెళ్లి జీవితం ఎలా ఉంది అనేది చూపించి ఆ తర్వాత అక్కడి నుంచి సిండికేట్ లో మరొక విలన్ ఎంటర్ అవ్వడం బన్వర్ సింగ్ షేకావత్ క్యారెక్టర్ పుష్పరాజు మీద ఎలాంటి రివెంజ్ కి ప్లాన్ చేస్తున్నాడు.
అలాగే మంగళం శ్రీను క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయాలను కూడా చాలా స్పష్టంగా తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న సుకుమార్ తనదైన రీతిలో సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆయన కథని చాలా పకడ్బందీగా రాసుకున్నారట.
ఇక దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా డిజైన్ చేసుకొని ప్రేక్షకుల మెప్పు పొందడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా మీద గత కొన్ని రోజుల నుంచి కొన్ని కాంట్రవర్సీలు అయితే నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ ప్రస్తుతం అవేవీ పెద్దగా సినిమాను డిస్టర్బ్ చేసే రేంజ్ కి అయితే వెళ్లలేదు. కాబట్టి ఐదు రోజుల్లో రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే ఉంది.
ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…