మోడీపై కేసీఆర్ పగ.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ హోరు

తెలంగాణపై దండయాత్ర చేసి కేసీఆర్ ఇగోను దెబ్బతీసిన బీజేపీపై భారత్ బంద్ వేళ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి బంద్ లు, రాస్తారోలు, హర్తాల్ పై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ తొలిసారి స్వయంగా భారత్ బంద్ పిలుపును ఇచ్చి ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కాలని ఆదేశించడం విశేషమనే చెప్పాలి. Also Read: భారత్ బంద్ ఎందుకు ? తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది […]

Written By: NARESH, Updated On : December 8, 2020 10:37 am
Follow us on

తెలంగాణపై దండయాత్ర చేసి కేసీఆర్ ఇగోను దెబ్బతీసిన బీజేపీపై భారత్ బంద్ వేళ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ వ్యవస్థను ఆధునీకరించి బంద్ లు, రాస్తారోలు, హర్తాల్ పై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ తొలిసారి స్వయంగా భారత్ బంద్ పిలుపును ఇచ్చి ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కాలని ఆదేశించడం విశేషమనే చెప్పాలి.

Also Read: భారత్ బంద్ ఎందుకు ?

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే అది ఖచ్చితంగా బీజేపీ వల్లనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత్ బంద్ కు పిలుపునిస్తే విపక్షాల ఆందోళలను కేసీఆర్ అణిచివేసేవారు. హౌస్ అరెస్టు లు చేయించేవారు. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టకుండా కట్టడి చేసేవారు. ఇందుకు భిన్నంగా కేసీఆర్ ఈరోజు భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పిలుపునివ్వడం విశేషం.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిస్తే గులాబీ దండు ఊరుకుంటుందా..? ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా బంద్ పెట్టారు. బస్సులు, రైళ్లను ఆపేశారు. దుకాణాలు మూసివేయించారు. ఇక్కడ బంద్ చేసి కేంద్రానికి సెగతగిలేలా చేయాలని కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేశారు.

Also Read: 505కు చేరిన ఏలూరు బాధితులు.. వింతవ్యాధికి కారణమిదే..

విశేషం ఏంటంటే నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసనల్లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం రోడ్డెక్కి ఆందోళనల్లో పాల్గొనడం తెలంగాణలో ఎప్పుడూ చూడలేదు. బూర్గులలో రైతులతో కలిసి కేటీఆర్ ధర్నా నిర్వహిస్తున్నారు. మంత్రి హరీష్ తుప్రాన్ లో రాస్తారోకో చేస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి నిరసనలకు ప్రభుత్వం, మంత్రులు దూరంగా ఉంటారు. కానీ బీజేపీపై కోపంతో రగిలిపోతున్న గులాబీ దండు ఇప్పుడు కసిగా ఆందోళనలు చేస్తూ కమలదళానికి సెగ పుట్టిస్తోంది. షరా మామూలుగానే ఈసారి పోలీసులు ఈ ధర్నాలు, రాస్తారోకోలను అణిచివేయకుండా దూరంగా ఉండడం విశేషం. ఇలా బీజేపీపై కోపంతో కేసీఆర్, టీఆర్ఎస్ టీం కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల పోరుకు మద్దతుగా తెలంగాణను స్తంభింపచేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్