Homeఎంటర్టైన్మెంట్Shahrukh Khan Limousine Car: ప్రపంచంలోనే పొడవైన కారు కింగ్‌ ఖాన్‌ సొంతం.. కళ్లు చెదిరే...

Shahrukh Khan Limousine Car: ప్రపంచంలోనే పొడవైన కారు కింగ్‌ ఖాన్‌ సొంతం.. కళ్లు చెదిరే సౌకర్యాలు!

Shahrukh Khan Limousine Car: భారతీయ రోడ్లపై ప్రపంచంలోనే అతి పొడవైన కార్లు ఈ లిమోసిన్‌ తిరగడానికి అనుమతి లేదు. కానీ మన దేశంలో ఆ లిమోసిన్‌ కారు కేవలం ఒకే ఒక్క హీరో వద్ద ఉంది. ఈ విలాసవంతమైన లిమోసిన్‌కు యజమానిగా బాలీవుడ్‌ రారాజు కింగ్‌ ఖాన్‌.. షారుక్‌ ఖాన్‌. బాద్‌షాకు నటనతోపాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. సొంతంగా నిర్మాణ సంస్థ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో కూడా ఉంది. ముంబైతో పాటు, లండన్, దుబాయ్‌లలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.

సినిమాల్లో మాత్రమే కనిపించే కారు..
లిమోసిన్‌ కారు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు. ఇది ఎక్కువగా హాలీవుడ్‌ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక భారతదేశంలో చూడడం చాలా అరుదు. ఈ కారును హాలీవుడ్‌ సినిమాల్లో బ్యాచిలర్‌ పార్టీ లేదా విలాసవంతమైన జీవనశైలిని చూపించడానికి మాత్రమే ఈ పొడవైన లిమోసిన్‌లను ఉపయోగిస్తారు. అందులో కూర్చుని హాయిగా పార్టీ చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ రోడ్లపై ఈ లిమోసిన్‌లు తిరగడానికి అనుమతి లేదు. కానీ మన దేశంలో ఈ లిమోసిన్‌ కారు బాలీవుడ్‌ బాద్‌షా వద్ద ఉంది. షారూక్‌ఖాన్‌ 2014లోనే ఈ కారు కొనుగోలు చేశాడు.

ప్రధానితో ప్రత్యేక అనుబంధం..
లిమోసిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. 2018లో కామన్వెల్త్‌ సమ్మిట్‌కు ప్రధాని మోదీ హాజరైనప్పుడు ఆయన తన హోటల్‌ నుంచి ఈవెంట్‌ జరిగే ప్రదేశానికి వెళ్లడానికి ప్రోటోకాల్‌ ప్రకారం లగ్జరీ సెడాన్‌ లిమోసిన్‌ను ఉపయోగించారు. ప్రధాని మోదీ మాత్రమే ఈ 100 మీటర్ల పొడవైన కారులో ప్రయాణించారు. 2014లో బాద్‌షా కుటుంబం దుబాయ్‌ రాజకుటుంబాన్ని కలవడానికి ఈ విలాసవంతమైన కారును ఉపయోగించింది.

చాలా మందికి ఇష్టమైన కారు..
నిజానికి, అమితాబ్‌ బచ్చన్‌ నుంచి హృతిక్‌ రోషన్‌ వరకు చాలా మంది భారతీయ నటులకు ఈ కార్లంటే చాలా ఇష్టం. అయితే భారతీయ రోడ్లపై అనుమతి లేకపోవడంతో కొనుగోలుకు వెనుకాడుతున్నారు. ఫైస్టార్‌ హోటళ్లలో ఉండే సౌకర్యాలు ఉన్న ఈ కార్లను భారతీయ రోడ్లపై తిరగడానికి కేంద్రం అనుమతి ఇస్తే ఈ పొడవైన వాహనాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి అనేక నగరాల్లో కచ్చితంగా తిరుగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version