https://oktelugu.com/

NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..?

NTR-Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబో లో ఒక సినిమా రాబోతుందనే విషయం మనకు తెలిసిందే.. నిజానికి వీళ్ళ కాంబో లో ఒక సినిమా ఇంతకు ముందే రావాల్సింది.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 10:09 AM IST

    When is NTR Prashanth Neel movie going to the set

    Follow us on

    NTR-Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)… ఇక తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద మోస్తున్న హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం… ఇక ఇప్పటికే ఎన్టీఆర్ చాలా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో దేవర సినిమా(Devara Movie) చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ అయితే వచ్చింది.

    ఈ సాంగ్ చాలా బాగుండటంతో సినిమా మీద అలాగే ఎన్టీఆర్ మీద మరింత బాధ్యతను పెంచిందనే చెప్పాలి. ఇక దాంతో సినిమా యూనిట్ మొత్తం ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పొరపాటున ఈ సినిమా లో ఒక్క చిన్న మిస్టేక్ జరిగిన కూడా సినిమా యూనిట్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల, హీరో ఎన్టీఆర్ ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Varahi And Kantara: సుమంత్ హీరోగా వస్తున్న వారాహి కి, కాంతార సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..?

    ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబో లో ఒక సినిమా రాబోతుందనే విషయం మనకు తెలిసిందే.. నిజానికి వీళ్ళ కాంబో లో ఒక సినిమా ఇంతకు ముందే రావాల్సింది. కానీ ఈ సినిమా అనేది లేట్ అవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేశారట. దానివల్ల ఈ సినిమాని ఆగస్టులో గానీ, సెప్టెంబర్ లో గాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ఆయన తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    Also Read: Bharateeyudu 2: విక్రమ్ సినిమా బాట లోనే నడుస్తున్న భారతీయుడు 2… వర్కౌట్ అవుతుందా..?

    ఇక ఆ లోపు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2(War 2) సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ గా ఉంటాడు. దాంతో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…