https://oktelugu.com/

Bharateeyudu 2: విక్రమ్ సినిమా బాట లోనే నడుస్తున్న భారతీయుడు 2… వర్కౌట్ అవుతుందా..?

కమలహాసన్ ఇంట్రాడక్షన్ చూడాలంటే దాదాపు 30 నిమిషాల పాటు అభిమానులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటూ సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 2, 2024 / 05:50 PM IST

    Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమలహాసన్… ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కమలహాసన్ గత చిత్రమైన విక్రమ్ సినిమాతో చాలా మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

    ఇక ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే విక్రమ్ సినిమాలో కమలహాసన్ ఫస్టాఫ్ మొత్తం లో చాలా తక్కువ సమయమే కనిపిస్తాడు. అలాగే భారతీయుడు 2 సినిమాలో కూడా ఆయన నిడివి చాలా తక్కువ సేపే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదట సిద్ధార్థ్, రకుల్ ప్రీతిసింగ్ పైన సినిమా ఓపెన్ చేస్తారట. ఆ తర్వాత వీళ్ళ మధ్యలోనే కొంత సినిమా నడిచిన తర్వాత అప్పుడు కమలహాసన్ ఎంట్రీ ఉంటుందట.

    ఇక మొత్తానికైతే కమలహాసన్ ఇంట్రాడక్షన్ చూడాలంటే దాదాపు 30 నిమిషాల పాటు అభిమానులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటూ సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి విక్రమ్ లో కూడా కమలహాసన్ ఇలాగే తక్కువ సేపు కనిపించాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరి దాని బాటలోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అంటూ మరి కొంతమంది కమలహాసన్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే విక్రమ్ ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో భారతీయుడు 2 సినిమా కూడా అలాంటి సక్సెస్ ను సాధించినట్లైతే కమలహాసన్ మరోసారి స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా కలెక్షన్ల సునామీని కూడా సృష్టిస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి విక్రమ్ సినిమాకి వర్కౌట్ అయినట్టుగా ఈ సినిమాకి కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి…