https://oktelugu.com/

Varahi And Kantara: సుమంత్ హీరోగా వస్తున్న వారాహి కి, కాంతార సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..?

వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలిపే సినిమా కావడంతో కథపరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, ఈ సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ దక్కించుకోబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 2, 2024 / 02:02 PM IST

    Varahi And Kantara

    Follow us on

    Varahi And Kantara: అక్కినేని నాగేశ్వరరావు స్టార్ హీరోగా ఒకప్పుడు తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత అక్కినేని ఫ్యామిలీ భారం మొత్తాన్ని మోస్తూ వస్తున్న నటుడు నాగార్జున..ఇక ఈయన తర్వాత ఇండస్ట్రీకి చాలామంది అక్కినేని హీరోలు పరిచయం అయినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా ఆశించిన మేరకు సక్సెస్ లు సాధించలేకపోయారు. నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోలు కూడా స్టార్లు గా మారలేకపోయారు.

    ఇక వీళ్ళతో పోలిస్తే సుమంత్ చాలా వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఆయన మొదట్లో సత్యం, గౌరీ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ములతో చేసిన ‘గోదావరి ‘ సినిమాతో ఆయనకు క్లాస్ హీరోగా గుర్తింపు రావడమే కాకుండా దాంతో ఒక డీసెంట్ హిట్ కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్లీరావా, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికోసమే సుబ్రహ్మణ్యపురం సినిమాతో తనకు ఒక మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ ‘సంతోష్ జాగర్లపూడి’ డైరెక్షన్ లో ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాడు.

    ఇది కూడా వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలిపే సినిమా కావడంతో కథపరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ, ఈ సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ దక్కించుకోబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ‘కాంతార ‘ సినిమాలో ఎలాంటి ఎక్స్ ట్రా ఆర్డినరీ సీన్స్ అయితే ఉన్నాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ‘వారాహి ‘ లో కూడా అలాంటి సీన్స్ ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా కాంతార లానే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఒక రకంగా మనం వారాహి ని తెలుగు కాంతార గా చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    అయితే ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సుమంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలవబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇక తొందర్లోనే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీజర్ వచ్చాక ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశలైతే ఉన్నాయి…