Legendary Heroes: ఇద్దరు లెజెండరీ హీరోలతో ఫొటో దిగిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

Legendary Heroes: చిరంజీవితో పాటు పోటీపడుతూ వచ్చిన మరొక హీరో బాలయ్య బాబు(Balayya Babu) వీళ్లిద్దరి మధ్య సినిమాలా పరంగా ఎప్పుడు తీవ్రమైన పోటీ అయితే ఉండేది.

Written By: Gopi, Updated On : June 3, 2024 10:16 am

mokshagna-childhood-pic

Follow us on

Legendary Heroes: తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయనే నెంబర్ వన్ హీరో కూడా కొనసాగుతున్నాడు. ఇక ఆయనను బీట్ చేయాలని చాలామంది హీరోలు ప్రయత్నం చేసినప్పటికీ, ఎప్పటికప్పుడు చిరంజీవి కొత్త పంథాను ఎంచుకొని తనను బీట్ చేయడం ఎవరి వల్ల కాదు అనే రేంజ్ లో ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ మంచి విజయాలను కూడా అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే చిరంజీవితో పాటు పోటీపడుతూ వచ్చిన మరొక హీరో బాలయ్య బాబు(Balayya Babu) వీళ్లిద్దరి మధ్య సినిమాలా పరంగా ఎప్పుడు తీవ్రమైన పోటీ అయితే ఉండేది. ఇక సినిమా కెరియర్ ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఒక పర్సనల్ ఫంక్షన్ లో ఒకరోజు వీరిద్దరూ కలిసి ఫోటో దిగుతున్నప్పుడు వీళ్ళ పక్కన ఇంకొక బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు ఎవరు.? చిరంజీవి బాలయ్య లతో కలిసి ఫోటో దిగే రేంజ్ లో ఆ బాబుకి ఉన్న బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Balakrishna: బాలకృష్ణ యంగ్ హీరోలతో ఫ్రెండ్షిప్ చేయడానికి అసలు కారణం ఇదేనా..?

నిజానికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా జనాలు తెలుసుకోకుండా విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఆ ఫోటో లో చిరంజీవి బాలయ్య లతో ఉన్న వ్యక్తి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ(Mokshagna)… ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలు చేస్తూనే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు.

Also Read: Bharateeyudu 2: విక్రమ్ సినిమా బాట లోనే నడుస్తున్న భారతీయుడు 2… వర్కౌట్ అవుతుందా..?

ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య బాబు మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూనే తనను యంగ్ హీరోస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోమని చెప్పానని ఆ సభాముఖంగా చెప్పడం విశేషం… అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బోయపాటి శీను కానీ, లేదంటే అనిల్ రావిపూడి కానీ రంగంలోకి దిగే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి ఆయన ఎంట్రీ ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది…