Gold Rates Today: బంగారం ప్రియులకు ఊరట..

Gold Price Today: గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఆ తరువాత తగ్గాయి. అయితే ఆదివారం స్థిరంగా కొనసాగాయి.

Written By: Chai Muchhata, Updated On : June 3, 2024 8:09 am

Gold Purchase

Follow us on

Gold Price Today: గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఆ తరువాత తగ్గాయి. అయితే ఆదివారం స్థిరంగా కొనసాగాయి. దేశీయంగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,550 గా ఉంది. జూన్ 2న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారంతో పోలిస్తే సోమవారం స్థిరంగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,200తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్థిరంగా కొనసాగినా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.93,400గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం రూ.100 మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.93,400గా ఉంది. ముంబైలో రూ.93,400, చెన్నైలో రూ.97,900 బెంగుళూరులో 92,900, హైదరాబాద్ లో రూ. 97,900 తో విక్రయిస్తున్నారు.