Allu Aravind: డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అంచనాలను రెట్టింపు చేయాల్సిన ఉద్దేశ్యంతో నిన్న ఈ సినిమాకి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక చీఫ్ గెస్ట్ ఎవరూ లేకుండానే ఈవెంట్ నిర్వహించడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మేనియాను చూపించే విధంగా ఈ ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా సినిమా మీద భారీ అంచనాలను పెంచేశారు. ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటబోతున్నాడనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఈవెంట్ లో చాలామంది మాట్లాడినప్పటికీ అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయనే చెప్పాలి. ఆయన రీసెంట్ గా పుష్ప 2 సినిమాని చూశారట. అయితే ఈ సినిమా చూసి తను ఇంటికి వెళ్ళగానే తన భార్య చూసి ఏంటి ఫేస్ బ్రైట్ గా వెలిగిపోతుంది అని అన్నారని చెప్పాడు. దాంతో ఆయన రెండు సినిమాలు చూసినప్పుడు నా ఫేస్ ఆటోమేటిగ్గా బ్రైట్ అయిపోయిందని చెప్పాడు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర కాగా, రెండు పుష్ప 2… ఇక మగధీర సినిమా చూసినప్పుడు ఆయన ఎలాంటి అనుభూతిని అయితే పొందాడో పుష్ప 2 సినిమా విషయంలో కూడా తను అలాగే గ్రేట్ గా ఫీల్ అయినట్టుగా తెలియజేశాడు.
మరి మొత్తానికైతే ఈయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అరవింద్ చెప్పిన మాటలతో అభిమానులు చాలా ఆనందపడుతున్నారు.
మరి పుష్ప 2 సినిమాను మగధీరతో పోల్చడం పట్ల ఇటు మెగా అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఎలాగైతే ఎలివేట్ అయ్యాడో అలాగే ఈ సినిమాతో భారీగా ఎలివేట్ అవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టి అల్లు అర్జున్ ని ఏ పొజిషన్ లో నిల్చోబెడుతుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…