https://oktelugu.com/

ఈ బ్యూటీ కెరీర్ ఎప్పుడు సెట్ అవుతుందో ?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా..ఒక్కోసారి అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు మాత్రం రావు అనేది కొంతమంది కెరీర్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఇందుకు ప్రత్యేక నిదర్శనం.. భారీ హిట్ అందుకున్నాక కూడా అవకాశం లేక ఇంకా రెండేళ్ల నుండి ఖాళీగా కూర్చున్న బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ కౌశికే ఉదాహరణ. నిజంగా ఈ బ్యూటీ టాలెంట్ పరంగా, గ్లామర్ పరంగా ఏ మాత్రం వంకపెట్టలేని హీరోయిన్. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను […]

Written By:
  • admin
  • , Updated On : November 19, 2020 / 07:21 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా..ఒక్కోసారి అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు మాత్రం రావు అనేది కొంతమంది కెరీర్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఇందుకు ప్రత్యేక నిదర్శనం.. భారీ హిట్ అందుకున్నాక కూడా అవకాశం లేక ఇంకా రెండేళ్ల నుండి ఖాళీగా కూర్చున్న బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ కౌశికే ఉదాహరణ. నిజంగా ఈ బ్యూటీ టాలెంట్ పరంగా, గ్లామర్ పరంగా ఏ మాత్రం వంకపెట్టలేని హీరోయిన్. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయినా ఈ బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ లు మాత్రం ఆ తరువాత అంత గొప్పగా ఏమి రాలేదు.

    Also Read: పాపం అనుపమా.. ఇక్కడ అదే బాధ !

    మజిలీలో నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఈ అమ్మడు చాలా బాగా ఆకట్టుకుంది. తెలుగు రాకపోయినా.. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్ గా నటించింది ఈ బ్యూటీ. అయినా ఉపయోగం ఏముంది..? మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోయింది. సమంత హవాలో దివ్యాంశ కేవలం సెకెండ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. పోనీ సెకెండ్ హీరోయిన్ గా అన్నా గుర్తించారా అంటే.. అదీ లేదు. దాంతో దివ్యాంశకు రావాల్సిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. దాంతో ఆమెకు పెద్దగా ఆఫర్స్ కూడా రాలేదు. మజిలీ టీం మొత్తం తమ తరువాత సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటే.. దివ్యాంశ కౌశిక్ మాత్రం ఇంకా ఛాన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉండాల్సిన పరిస్థితి.

    Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ రిలీవ్.. లాకవుతున్న చరణ్..!

    అయినా ఈ భామ మాత్రం సినిమా ఆఫర్ కోసం ఇంకా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి దివ్యంశ కౌశిక్ పరిస్థితి సినిమా భారీ హిట్.. తాను మాత్రం ఫట్ మాదిరిగా తయారయింది. మజిలీలో దివ్యాంశ కౌశిక్ తన పాత్రలో అద్భుతంగా నటించినా… ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఎలాంటి మొహమాటం చూపించకపోయినా ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో పాపం. ఒకపక్క సరైన హిట్ లేని నభా నటేష్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ కి ఆఫర్లు లేకపోవడం బాధాకరమైన విషయమే. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ కెరీర్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్