https://oktelugu.com/

గుండెను ఆరోగ్యానికి ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారాలివే..?

దేశంలో రోజురోజుకు కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్న వయస్సు వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వేర్వేరు వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే చాలామంది హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం వంటల్లో వాడే నూనె వ్యాధుల బారిన పడటానికి కారణమవుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె ఆరొఅగ్యాన్నికాపాడుకోవచ్చు. దేశంలో ప్రతి సంవత్సరం చనిపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలతో చనిపోయే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. గుండె […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2020 10:00 pm
    Follow us on

    దేశంలో రోజురోజుకు కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. చిన్న వయస్సు వాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ వేర్వేరు వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే చాలామంది హృదయ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మనం వంటల్లో వాడే నూనె వ్యాధుల బారిన పడటానికి కారణమవుతోంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె ఆరొఅగ్యాన్నికాపాడుకోవచ్చు.

    దేశంలో ప్రతి సంవత్సరం చనిపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలతో చనిపోయే వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంది. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడితే దీర్ఘకాలం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వైద్య నిపుణులు చాలామంది నిత్యం చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్లే హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.

    జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, తీపి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తినడం, ప్రతిరోజూ వ్యాయామం చేయకపోవడం, ఇతర కారణాల వల్ల చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రతిరోజు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ తీసుకోవడం, రాజ్మా, పప్పులు, శనగలను తరచూ తీసుకోవడం, క్రమం తప్పకుండా ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండవు.

    ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తో వండిన ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. కూరగాయలను ఎంత ఎక్కువగా తీసుకుంటే గుండెకు అంత మేలు చేకూరుతుంది. ప్రతిరోజూ పాలు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడము.