https://oktelugu.com/

లక్ అంటే ఈ హీరోయిన్ దే !

హీరోయిన్లకు కాస్త డిమాండ్ ఉన్నా చాలు… ఇక భారీ రెమ్యునరేషన్ అడగడానికి తెగ ఊబలాటపడుతుంటారు. అయితే మొదటి సినిమానే ఇంకా రిలీజ్ కానీ ఓ హీరోయిన్ మాత్రం, స్టార్ హీరోయిన్ రేంజ్ లో డిమాండ్ చేస్తే.. ఏంటి పరిస్థితి. అయినా మేకర్స్ కు ఆమె నటన ఎలా ఉంటుంది.. ఆమె ఏ మేరకు పాత్రను మోయగలదు ఇలాంటి విషయాలేవీ తెలియకుండా.. ఆమె అడిగినంత ఎందుకు ఇవ్వాలి. నటిగా నిరూపించుకోనూ కూడా లేదు. అప్పుడే రేటు మాత్రం ఆకాశమంత […]

Written By:
  • admin
  • , Updated On : November 19, 2020 / 07:03 PM IST
    Follow us on


    హీరోయిన్లకు కాస్త డిమాండ్ ఉన్నా చాలు… ఇక భారీ రెమ్యునరేషన్ అడగడానికి తెగ ఊబలాటపడుతుంటారు. అయితే మొదటి సినిమానే ఇంకా రిలీజ్ కానీ ఓ హీరోయిన్ మాత్రం, స్టార్ హీరోయిన్ రేంజ్ లో డిమాండ్ చేస్తే.. ఏంటి పరిస్థితి. అయినా మేకర్స్ కు ఆమె నటన ఎలా ఉంటుంది.. ఆమె ఏ మేరకు పాత్రను మోయగలదు ఇలాంటి విషయాలేవీ తెలియకుండా.. ఆమె అడిగినంత ఎందుకు ఇవ్వాలి. నటిగా నిరూపించుకోనూ కూడా లేదు. అప్పుడే రేటు మాత్రం ఆకాశమంత ఎత్తులో కోట్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఉప్పెన భామ కృతిశెట్టి. పాపకు బాగానే క్రేజ్ ఉన్నా.. అప్పుడే స్టార్ స్టేటస్ అయితే రాలేదు. కానీ స్టార్ హీరోయిన్ కంటే ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

    Also Read: పాపం అనుపమా.. ఇక్కడ అదే బాధ !

    అయితే.. ఉప్పెన టైటిల్ సాంగ్ లో కనుబొమ్మలు ఎగిరేసి, అలా చిరు మందహాసాన్ని చూపెట్టి మొత్తానికి తనలో బాగానే మ్యాటర్ ఉందని నిరూపించుకుంది. పైగా తన హోమ్లీ లుక్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అనుకోండి. అయితే లిరికల్ వీడియోలో మాత్రమే కృతిశెట్టి కనిపించి ఫేమస్ అయింది గాని, అమెకంటూ సొంతగా ఇంకా ఎలాంటి ఫాలోయింగ్ రాలేదు. ఉప్పెన సినిమా రిలీజ్ అయితే కృతి శెట్టి భవితవ్యం ఏంటో తెలిసిపోతోంది. కాకపోతే ఉప్పెన ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్‌లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుస్తారని అంటున్నారు కాబట్టి.. మరి డిసెంబర్ లో ఉప్పెన సినిమా రిలీజ్ అయి హిట్ అయితే.. కృతి శెట్టికి భారీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ రిలీవ్.. లాకవుతున్న చరణ్..!

    ఇప్పటికే నాని సరసన శ్యామ్ సింఘరాయ్, సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ మూడో సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ కోట్ చేసింది. ఎనభై లక్షలు ఇస్తేగానీ నటించనని చెప్పి మరీ.. అంతే ఎమౌంట్ వసూళ్లు చేస్తోంది. వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే గానీ ఆ రేంజ్ రెమ్యూనరేషన్‌ ను అంత ఈజీగా అడగలేరు. కానీ కృతి మాత్రం మొదటి ఫిల్మ్ కూడా విడుదల కాకముందే అంత మొత్తంలో డిమాండ్ చేసి తీసుకోవడం నిజంగా విశేషమే. పైగా మొదటి సినిమానే ఇంకా పూర్తి కాలేదు కానీ నిర్మాతలు మాత్రం ఆమె కోసం క్యూ కడుతూనే ఉన్నారు. లక్ అంటే ఈ హీరోయిన్ దే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్