https://oktelugu.com/

Rajasekhar: రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి కారణం ఏంటి?

రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలు ఏకంగా వివాదాల వల్ల ఆగిపోయాయి.రీసెంట్ గా వచ్చిన గరుడ వేగ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించినా పెద్దగా పేరు సంపాదించలేదు. అంతే కాదు శేఖర్ అనే సినిమా 2022లో వచ్చి ఫ్లాప్ గా నిలిచింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 16, 2023 / 03:44 PM IST

    Rajasekhar

    Follow us on

    Rajasekhar: ఒకప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించారు సీనియర్ నటుడు రాజశేఖర్. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా రాజ్యమేలారు కూడా.. ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తనకు పోటీ లేరు అనే రేంజ్ కి ఎదిగారు. కానీ కొందరు స్టార్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి రేంజ్ ను పెంచుకుంటూ ఇండస్ట్రీలో తమ స్థానాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఎందుకో రాజశేఖర్ మాత్రం ఈ విషయంలో విఫలం అయ్యారు. అంతే కాదు రీసెంట్ఈ గా యన నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యాయి.

    రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలు ఏకంగా వివాదాల వల్ల ఆగిపోయాయి.రీసెంట్ గా వచ్చిన గరుడ వేగ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించినా పెద్దగా పేరు సంపాదించలేదు. అంతే కాదు శేఖర్ అనే సినిమా 2022లో వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం హీరోగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు రాజశేఖర్. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారట ఈ హీరో.

    గతంలో స్టార్ హీరోగా మెప్పించిన రాజశేఖర్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి కారణం ఏంటి అని ఆయన అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. ఇంతలోనే ఆయన కూతురు శివానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది. కోటబొమ్మాలి అనే సినిమాలో నటించింది శివానీ.. ఈ సినిమా 24వ తేదీనా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇదే సందర్భంలో తండ్రి గురించి కొన్నినిజాలు చెప్పింది శివాని. అయితే రాజశేఖర్ కు నెగిటివ్ పాత్రలలో అంటే విలన్ పాత్రలలో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేదట.

    విజయ్ సేతుపతి అరవిందస్వామి, జగపతి బాబు వంటి వారి తరహాలో ఈయన కూడా నటించాలనే కోరిక బలంగా ఉండేదట. ఇలా అనుకోని విధంగా నితిన్ సినిమాలో నెగిటివ్ రోల్ రావడంతో వెంటనే ఒప్పేసుకున్నారట రాజశేఖర్.ఎంతో ఇష్టంతో నాన్ని ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది శివాని.మరి ఈ సినిమాలోని కొత్త రోల్ ఎలాంటి పేరు సంపాదించి పెడుతుందో చూడాలి…