Prabhas : రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న చాలా సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి…
ప్రభాస్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మరొకరు ఉండరు…ఆయన చేసే సినిమాలు కూడా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుంటుంది…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇక మీదట రాబోయే సినిమాలతో సక్సెస్ ని సాధిస్తాడా? దానివల్ల ఆయన ఎలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రెండు మూడు రోజుల నుంచి ప్రభాస్ కి ఒక సినిమా షూటింగ్ లో గాయం అయింది అంటు కొన్నివార్తలైతే వస్తున్నాయి. చీలమండ బెనికింది అంటు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన నటించిన కల్కి సినిమాని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆయన అక్కడ నిర్వహించే ఈవెంట్ లో పాల్గొంటే బాగుంటుందని అందరూ అనుకున్నప్పటికి ఆయన గాయం కారణంగా అక్కడ ఈవెంట్ కి మాత్రం హాజరు కాలేకపోతున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే అసలు ఏ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయం అయింది అని అంటున్నారు…అసలు ఇప్పుడు ఆయన ఏ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు అంటూ కొంతమంది మాత్రం కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు… నిజానికి బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ కి ప్రతి సందర్భంలో ఏదో ఒక హెల్త్ ఇష్యు అయితే వచ్చి ఇబ్బంది పెడుతుందంటూ ఆయనకి కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇస్తున్నారు. నిజానికి ఆయనకు ఇప్పుడు గాయాలు అవుతున్నాయా లేదంటే ఆయనకి పర్సనల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటూ కొంతమంది కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయనకి ఆర్థోపెడిక్ కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ అయితే ఆయనకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే న్యూరోకి సంబంధించిన మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా అతనిని తరచుగా ఇబ్బంది పెడుతున్నాయట. ఇక దాని వల్లే ఆయన తరచుగా ఇటలీకి వెళ్ళేస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఒక విల్లాను కూడా కొనుక్కున్నాడు.
ఇక ఆయన వెళ్ళినప్పుడు అక్కడే ఉండడానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన దాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాహుబలి సినిమా అయిపోయినప్పటి నుంచి తరచుగా ఆయన అక్కడికి వెళుతూ ఉండడం విశేషం. మరి అంతగా ఆయన హెల్త్ పాడవ్వడానికి గల కారణం ఏంటి..?
ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఆయనకి ఏదో ఒక గాయమైతే అయిందని కొన్ని వార్తలైతే బయటకు వస్తుంటాయి. నిజంగా అతనికి గాయాలు తగులుతాయా? లేదంటే కావాలని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ కి మాత్రం కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక బాహుబలి సినిమా సమయంలో ఆయన అవుట్ ఫిట్ గానీ, స్ట్రక్చర్ గాని ఫేసులో గ్లో కానీ ఇప్పుడైతే లేవు…ఇక ఆది పురుష్ మూవీ ప్రీ రిలీజ్ సమయంలో మాత్రం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు…ఇంతకీ ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తొందర్లోనే క్యూర్ అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…