Mokshagna Teja: మోక్షజ్ఞను హీరో చేయాలి అనేది బాలకృష్ణ కల. దాదాపు ఓ దశాబ్ద కాలంగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల ఆకాంక్ష నెరవేరుస్తూ మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ప్రకటన వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ప్రశాంత్ వర్మ కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేశాడు. హీరోగా మోక్షజ్ఞ ఎలా ఉండబోతున్నాడో అభిమానులకు చిన్న శాంపిల్ చూపించాడు.
ప్రశాంత్ వర్మకు టాలెంటెడ్ దర్శకుడిగా పేరుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. తేజ సజ్జా వంటి హీరోతో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శకుడిగా ప్రశాంత్ వర్మ రికార్డులకు ఎక్కాడు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి బడా స్టార్స్ ని వెనక్కి నెట్టి హనుమాన్ తో తేజ సజ్జా సంక్రాంతి విన్నర్ అయ్యాడు. మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు ఇవ్వడం సబబే అని బాలయ్య ఫిక్స్ అయ్యాడు.
డిసెంబర్ 5న మోక్షజ్ఞ మూవీ గ్రాండ్ లాంచ్ సెరిమోనికి ఏర్పాట్లు జరిగాయి. దాదాపు రూ. 30 లక్షలతో పెద్ద సెట్ కూడా ఏర్పాటు చేశారట. టాలీవుడ్ పెద్దలను పూజా కార్యక్రమానికి ఆహ్వానించారట. అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అప్పటి నుండి మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ గా రూ. 15 కోట్లతో పాటు లాభాల్లో వాటా అడుగుతున్నాడు. లేదంటే నా శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడిగా పని చేస్తాడని చెప్పాడు.. అంటూ గుసగుసలు మొదలయ్యాయి.
ప్రశాంత్ వర్మ తీరుకు బాలయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే. వెంకీ అట్లూరి, నాగ్ అశ్విన్ లలో ఒకరు మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. రెండు వారాలుగా ఈ పుకార్లు చక్కర్లు కొడుతున్నా టీమ్ స్పందించలేదు. దాంతో నిజమే కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో నిర్మాతలు స్పందించారు. అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు.
మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ వస్తాయి. సమాచారం అభిమానులతో పంచుకుంటాము. అంత వరకు దయచేసి నిరాధార కథనాలు ప్రచారం చేయవద్దు.. అంటూ లేఖలో పేర్కొన్నారు. నిర్మాతల ప్రకటనతో మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ రద్దు కాలేదని క్లారిటీ వచ్చింది.