Penugonda Lakshminarayana: తెలుగు రచయితకు మరో అరుదైన గౌరవం. ఏపీకి చెందిన ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జ్యూరీ సభ్యులు 21 భాషలకు గాను అవార్డులు సొంతం చేసుకున్న వారి పేర్లు ప్రకటించారు. ఇందులో తెలుగు భాషకు సంబంధించి పెనుగొండ లక్ష్మీనారాయణకు అవార్డు దక్కింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ అవార్డు లభించింది. ప్రస్తుతం ఆయన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణకు అవార్డు రావడం పై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. లక్ష్మీనారాయణ స్వస్థలం పల్నాడు జిల్లా చెరువు కొమ్ము పాలెం. ప్రస్తుతం ఆయన గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972లో సమిధ అనే కవితతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు లక్ష్మీనారాయణ.
* అంచలంచెలుగా ఎదుగుతూ
అభ్యుదయ భావాలు కలిగిన లక్ష్మీనారాయణ తన రచనల్లో వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. తొలుత అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా ఎన్నికయ్యారు. అటు తరువాత జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవిని అలంకరించిన తొలి తెలుగు సాహితీ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. ఎప్పుడు ఏకంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. అదేం చిన్న అవార్డు కాదు. జాతీయస్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.
* సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు
దేశవ్యాప్తంగా 21 భాషలకు గుర్తింపునిస్తూ ఈ అవార్డులను ప్రకటిస్తోంది కేంద్రం. కవితలతో పాటు నవలలు, లఘు కథలు, సాహిత్య విమర్శలు, వ్యాస సంపుటి లను సైతం పరిగణలోకి తీసుకుంటారు. అభ్యుదయ కవితలతో పాటు వ్యాసాలతో పెనుగొండ లక్ష్మీనారాయణ ఈ ఘనత సాధించారు. అవార్డులకు ఎంపికైన వారికి 2025 మార్చి 8న ఢిల్లీలో ప్రధానం చేయనున్నారు. లక్ష రూపాయల నగదుతో పాటు సన్మానించనున్నారు కూడా. పెనుగొండ లక్ష్మీనారాయణ ను సీఎం చంద్రబాబు అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. కాకా లక్ష్మీనారాయణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.