Star Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న చాలామంది వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకున్న వాళ్లు సైతం ఇప్పుడు సినిమాలు లేక డీలా పడిపోతున్నారు… వివి వినాయక్, శ్రీను వైట్ల లాంటి దర్శకులు సైతం ఇప్పుడు హీరోలను పట్టుకోవడంలో కొంతవరకు తడబడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మంచి సినిమాలను చేసినవాళ్లకే ఇక్కడ ఎక్కవ కాలం పాటు అవకాశాలైతే వస్తాయి. వాళ్లకు మాత్రమే మార్కెట్ క్రియేట్ అవుతోంది. వాళ్లకి స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారు. ఇక సంపత్ నంది లాంటి డైరెక్టర్ సైతం స్టార్టింగ్ లో రామ్ చరణ్ సినిమాలను చేసినప్పటికి అవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు.
ప్రస్తుతం ఆయన ఏ సినిమాను చేయాలో అర్థం కాక ఏదో ఒక సినిమాకు తీస్తున్నాడు. ఆయన ప్రస్తుతం సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేవీ అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురాలేదు. ఇకమీదట రాబోయే సినిమాలతో ఆయన స్టార్ డమ్ ని సంపాదించుకుంటే మంచిదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ప్రస్తుతం శర్వానంద్ తో చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి గొప్ప విజయాన్ని అందిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమాతో ఆయన తడబడితే మాత్రం ఇక ఆయనకు అవకాశాలు రావడం అనేది అసాధ్యం అనే చెప్పాలి…
ఈయనతో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన దర్శకులందరు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతూ స్టార్ హీరోలను డైరెక్షన్ చేస్తుంటే సంపత్ నంది మాత్రం ఇంకా మీడియం రేంజ్ హీరోల దగ్గరే ఆగిపోయాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలను డైరెక్షన్ చేసిన ఆయన తన సత్తాను చూపించుకోకపోవడంతో వెనుకబడిపోయాడు. ఇక ఇప్పటికైనా తనను తాను ఎలివేట్ చేసుకొని సక్సెస్ లను సాధిస్తే తప్ప ఆయనకి మంచి గుర్తింపైతే రాదు…