Devara: దేవర సినిమాలో పెద్ద ఎన్టీయార్ పాత్ర కి ప్రభాస్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఇక తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా జపం చేస్తున్నారు...

Written By: Gopi, Updated On : September 11, 2024 2:13 pm

Devara

Follow us on

Devara: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ మాస్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తేతే ఇప్పటి నుంచి ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఇప్పటివరకు తెలుగుకే పరిమితమైన ఆయన పాన్ ఇండియాలో సోలో హీరోగా మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దేవర సినిమాతో ఈనెల 27వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో రికార్డులను క్రియేట్ చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కొరటాల శివ ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నప్పటికీ ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల్ని అలరించడం లో కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే పెద్ద ఎన్టీఆర్ పాత్రని క్రియేట్ చేయడంలో కొరటాల శివ బాహుబలి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టుగా ట్రైలర్ ను చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా ఆలోచన పరంగా కూడా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలాంటి పాత్రని దేవర సినిమాలో పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ కోసం రాసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఎక్కడ శత్రువుని చంపాలి, ఎలాంటి శత్రువుని మంచివాడిగా మార్చాలి అనే క్యారెక్టర్ తో పెద్ద ఎన్టీఆర్ పాత్ర ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ద్వారా ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ ని కూడా వాడుకున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీయార్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడితేనే ఆయనకు బాలీవుడ్ లో గాని, టాలీవుడ్ లో గాని మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది.

తద్వారా ఆయన రెమ్యూనరేషన్ కూడా పెంచుకోవడానికి అవకాశాలైతే ఉంటాయి. ఇక తెలుగులో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి పాన్ ఇండియాలో తన సత్తా చూపిస్తేనే ఎన్టీఆర్ టైర్ వన్ హీరోల్లో నెంబర్ వన్ హీరో కోసం పోటీపడుతూ ఉంటాడు. లేకపోతే మాత్రం ఆ నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడం ఎన్టీయార్ కి చాలా వరకు కష్ట తరమవుతుందనే చెప్పాలి…