Rajamouli And Mahesh: రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన విజయ రహస్యం కూడా అదే. ప్రతి విషయంలో బెస్ట్ కోరుకుంటారు. తనకు నచ్చిన అవుట్ ఫుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వరు. నటులకు స్వయంగా నటించి చూపిస్తారు. ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్స్ సింక్ అయ్యే వరకు ఇద్దరినీ అల్లాడించాడట. అలాగే రాజమౌళి తన ప్రాజెక్ట్ డిటైల్స్ బయటకు రాకుండా చూసుకుంటారు. సెట్స్ లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరు మొబైల్ వాడటానికి వీల్లేదు.
షూటింగ్ స్పాట్ నుండి ఏ విధమైన వీడియోలు, ఫోటోలు లీక్ కాకుండా జాగ్రత్తపడతారు. ఏళ్ల తరబడి తెరకెక్కిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల నుండి వచ్చిన లీక్స్ చాలా తక్కువ. అవి కూడా అవుట్ డోర్ షూటింగ్ సమయంలో లీక్ అయ్యాయి. కాగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్నారు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
సాధారణంగా రాజమౌళి కొత్త చిత్రం ప్రారంభించే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ప్రాధమిక సమాచారం ఇస్తారు. ఆర్ ఆర్ ఆర్ కి ముందు కూడా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మహేష్ మూవీ విషయంలో అలా జరగలేదు. ఆగస్టు నెలలో మహేష్ బాబు బర్త్ డే కాగా, ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం బర్త్ డే విషెస్ పోస్టర్ పంచుకోలేదు. అసలు SSMB 29 ప్రాజెక్ట్ స్టేటస్ ఏమిటనేది తెలియదు.
అయితే బ్యాక్ గ్రౌండ్ లో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాడట. ఆ విషయాలేవీ మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారట. నటులు, సాంకేతిక నిపుణులతో పాటు లొకేషన్స్, సెట్స్… వంటి కీలక పనుల్లో తలమునకలై ఉన్నారట. ఇదంతా ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా పనులు చేసుకుంటూ పోతున్నాడట. ప్రెస్ మీట్ మాత్రం త్వరలో ఉంటుందని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట.
మరోవైపు మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. ఆయన జుట్టు, గడ్డం విపరీతంగా పెంచేశాడు. ఈ చిత్రం జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందట. మూవీ బడ్జెట్ రూ. 800 కోట్లు అంటున్నారు.