Homeఎంటర్టైన్మెంట్అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ?

అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ?

charan akilఅక్కినేని వంశం నుంచి మూడోతరంగా టాలీవుడ్లోకి నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువడిగా.. కింగ్ నాగార్జున తనయుడిగా నాగచైతన్య టాలీవుడ్లో రాణిస్తున్నారు. ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత 100%లవ్ మూవీతో మంచి భారీ విజయం అందుకున్నాడు. వరుసగా పలు మూవీలు చేస్తూ బీజీగా మారాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని టాలీవుడ్లో సెలబ్రెటీ కపుల్ గా నిలిచాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు.

Also Read: ఇంట్రెస్టింగ్.. పాతికేళ్లు వెనక్కి వెళ్లిన రేణుదేశాయ్..!

ఇక అఖిల్ విషయానికొస్తే చిన్నతనంలో ‘సిసీంద్రీ’ మూవీతో మంచి హిట్టుందుకున్నారు. 2014లో వచ్చిన ‘మనం’ మూవీలో అతిథి పాత్రలో అఖిల్ కన్పించాడు. ఆ తర్వాత 2015లో ‘అఖిల్’ మూవీతోనే అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించాడు. ఈ మూవీ తర్వాత ‘హల్లో’..‘మజ్ఞు’ మూవీల్లో నటించారు. ఈ మూవీలేవీ కూడా అఖిల్ ను స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి.

తాజాగా అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్’ మూవీలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. ఇందులో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ లు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. అఖిల్ నాలుగోవ మూవీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మూవీ వస్తుండగానే ఐదో మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రకటించాడు.

సురేందర్ రెడ్డి ‘సైరా’ మూవీ చేస్తున్న సమయంలో రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం సురేందర్ రెడ్డి ఓ కథను సిద్ధం చేసుకుని చరణ్ కు విన్పించగా ఒకే చేసినట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం కావడంతో చరణ్ ఈ మూవీని వదులుకున్నాడట. అఖిల్ తో ఈ మూవీ చేస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించడంతో సురేందర్ రెడ్డి అఖిల్ తో చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.

Also Read: సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా

రాంచరణ్ తొలి నుంచి అఖిల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సొంత తమ్ముడిగా భావించి సినిమా విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. దర్శకుడు సురేందర్ చరణ్ కోసం రాసుకున్న కథ చివరికీ అఖిల్ చేరడంతో ఈ మూవీతోనైనా అఖిల్ హిట్టు కొడుతారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version