https://oktelugu.com/

అఖిల్ మూవీకి చరణ్ కు ఉన్న సంబంధమెంటీ?

అక్కినేని వంశం నుంచి మూడోతరంగా టాలీవుడ్లోకి నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువడిగా.. కింగ్ నాగార్జున తనయుడిగా నాగచైతన్య టాలీవుడ్లో రాణిస్తున్నారు. ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత 100%లవ్ మూవీతో మంచి భారీ విజయం అందుకున్నాడు. వరుసగా పలు మూవీలు చేస్తూ బీజీగా మారాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని టాలీవుడ్లో సెలబ్రెటీ కపుల్ గా నిలిచాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 06:00 PM IST

    charan akil

    Follow us on

    అక్కినేని వంశం నుంచి మూడోతరంగా టాలీవుడ్లోకి నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువడిగా.. కింగ్ నాగార్జున తనయుడిగా నాగచైతన్య టాలీవుడ్లో రాణిస్తున్నారు. ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత 100%లవ్ మూవీతో మంచి భారీ విజయం అందుకున్నాడు. వరుసగా పలు మూవీలు చేస్తూ బీజీగా మారాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని టాలీవుడ్లో సెలబ్రెటీ కపుల్ గా నిలిచాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు.

    Also Read: ఇంట్రెస్టింగ్.. పాతికేళ్లు వెనక్కి వెళ్లిన రేణుదేశాయ్..!

    ఇక అఖిల్ విషయానికొస్తే చిన్నతనంలో ‘సిసీంద్రీ’ మూవీతో మంచి హిట్టుందుకున్నారు. 2014లో వచ్చిన ‘మనం’ మూవీలో అతిథి పాత్రలో అఖిల్ కన్పించాడు. ఆ తర్వాత 2015లో ‘అఖిల్’ మూవీతోనే అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించాడు. ఈ మూవీ తర్వాత ‘హల్లో’..‘మజ్ఞు’ మూవీల్లో నటించారు. ఈ మూవీలేవీ కూడా అఖిల్ ను స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి.

    తాజాగా అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్’ మూవీలో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరక్కిస్తున్నాడు. ఇందులో అఖిల్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ లు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. అఖిల్ నాలుగోవ మూవీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మూవీ వస్తుండగానే ఐదో మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రకటించాడు.

    సురేందర్ రెడ్డి ‘సైరా’ మూవీ చేస్తున్న సమయంలో రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం సురేందర్ రెడ్డి ఓ కథను సిద్ధం చేసుకుని చరణ్ కు విన్పించగా ఒకే చేసినట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం కావడంతో చరణ్ ఈ మూవీని వదులుకున్నాడట. అఖిల్ తో ఈ మూవీ చేస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించడంతో సురేందర్ రెడ్డి అఖిల్ తో చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.

    Also Read: సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా

    రాంచరణ్ తొలి నుంచి అఖిల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సొంత తమ్ముడిగా భావించి సినిమా విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. దర్శకుడు సురేందర్ చరణ్ కోసం రాసుకున్న కథ చివరికీ అఖిల్ చేరడంతో ఈ మూవీతోనైనా అఖిల్ హిట్టు కొడుతారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.