Also Read: ఇంట్రెస్టింగ్.. పాతికేళ్లు వెనక్కి వెళ్లిన రేణుదేశాయ్..!
కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడగా, సినిమా షూటింగులు బంద్ అయిన సంగతి తెల్సిందే. దీంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితయ్యారు. దీంతో సెలబ్రెటీలంతా సోషల్ మీడియాలో తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తన ఫ్యామిలీ ముచ్చట్లు.. సినిమా విషయాలతో సందడి చేస్తున్నాడు.
గత సంక్రాంతికి ‘సరిలేరునికెవ్వరు’తో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ఇటీవల సూపర్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే కరోనా కారణంగా సినిమా షూటింగులో మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఓ యాడ్ కోసం మహేష్ బాబు షూటింగులో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: రవితేజ మీద పగ పట్టిన డైరెక్టర్ !
చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు కొత్త లుక్కులో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లైట్‌గా గడ్డం.. మీసాలు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పిక్ పై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ యాడ్ కోసం ఫొటో షూట్ చేశారు. తాను మళ్లీ షూటింగులో పాల్గొనడం సంతోషంగా ఉందని మహేష్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేశాడు.