ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది హిందుత్వ అంశం కావడం.. వరుసగా ఏపీలో హిందుత్వ వ్యతిరేక సంఘటనలు చోటుచేసుకోవడంతో వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read: నాటి డమ్మీ నేతలే.. నేడు హీరోలు..
ఇక బీజేపీ-జనసేన ఈ అంతర్వేది రథం దగ్ధం విషయంలో పోరుబాట పట్టాయి. పవన్ కళ్యాణ్ తోపాటు బీజేపీ నేతలు దీక్షలు చేపట్టారు. బీజేపీ స్వయంగా రంగంలోకి దిగింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. కాగా సీబీఐ దర్యాప్తునకు రేపు ఉత్తర్వులను జారీ చేసేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది.
Also Read: ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపు
అంతర్వేది రథం దగ్ధమవడంపై రాష్ట్రంలోని రాజకీయపార్టీలతోపాటు హిందూ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. అయితే ఈ రథం దగ్ధం విషయంలో కుట్ర కోణం ఉందని ఏపీ సర్కార్ అనుమానిస్తోంది. నిష్పక్షపాత విచారణ కోసమే సీబీఐకి కేసును అప్పగించాలని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.