Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: 'లెనిన్' సక్సెస్ క్రెడిట్ ని ఆ స్టార్ హీరోకి ఇచ్చేసిన అక్కినేని అఖిల్.....

Akhil Akkineni: ‘లెనిన్’ సక్సెస్ క్రెడిట్ ని ఆ స్టార్ హీరోకి ఇచ్చేసిన అక్కినేని అఖిల్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Akhil Akkineni: అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో అఖిల్ ఒక భారీ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో స్థిరపడాలని కోరుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాకు ఎంతో కష్టపడతాడు, కానీ ఫలితం మాత్రం రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ తమ జీవితం లో నిజంగా సక్సెస్ సాధించలేకపోతే ఎలాంటి ఫీలింగ్ ని అనుభవిస్తారో , అఖిల్ విషయం లో కూడా అలాంటి ఫీలింగ్ ని అనుభవించారు. అలాంటి సమయం లో విడుదలైన ‘లెనిన్’ చిత్రం ఫ్యాన్స్ కి మిగిలిచిన మధురమైన జ్ఞాపకాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. హిట్ కోసం పదేళ్లకు పైగా ఎదురు చూసిన అఖిల్ కి , ఈ చిత్రం విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి , కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబడడం ఆయనకు , ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆనందాన్ని మిగిలించిందో, ఫ్యాన్స్ కి అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మిగిలించింది.

అఖిల్ ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ , అభిమానులను ఎంతో ఎమోషన్ కి గురి చేసిన ఈ సక్సెస్ ని వేరే స్టార్ హీరోకి అంకితం చేయడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. మన అందరికీ తెలిసిందే , రామ్ చరణ్ తో అఖిల్ కి ఎలాంటి గొప్ప రిలేషన్ ఉంది అనేది. తన సొంత అన్నయ్య లాగా ట్రీట్ చేస్తుంటారు. చిరంజీవి తో కూడా అఖిల్ కి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ని అఖిల్ రామ్ చరణ్ కి డేడికేట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ లాంటి స్టార్ పెద్ది చిత్రం లో అలాంటి క్లైమాక్స్ ని పెట్టి గొప్ప ప్రయోగం చేశారు. అలాంటి సూపర్ స్టార్స్ పాత్రకు ప్రాధాన్యత చేస్తే , మా లాంటి యంగ్ హీరోలకు కూడా కొత్త పాత్రలను చేసే ధైర్యం వస్తుంది. అందుకే ఈ విజయాన్ని నేను రామ్ చరణ్ కి అంకితం చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్.

అఖిల్ చేసిన ఈ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పట్ల తనకు ఉన్న గౌరవానికి , అభిమానానికి ఎంతో మురిసిపోతున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి గా లేరు. రామ్ చరణ్ తో ఆయనకు ఉన్న బంధాన్ని మేము అర్థం చేసుకోగలం , ఎదో ఒక ఈవెంట్ లో ఆయన గురించి గొప్పగా మాట్లాడితే పర్వాలేదు , అర్థం చేసుకుంటాము , కానీ ప్రతీ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే , భజన చేసినట్టుగా అనిపిస్తోంది. దయచేసి ఇక ఆపండి అంటూ అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version