Kalki Movie: కల్కి లో అమితాబ్ కి దీపికా పదుకొనే కి మధ్య సంబంధం ఏంటి..?

Kalki Movie: అమితబచ్చన్, దీపికా పదుకొనే చేసిన క్యారెక్టర్లకి మధ్య ఇంటర్ లింక్ ఏంటి అంటూ కొంతమంది ఆరా తీసే పనుల్లో బిజీగా ఉన్నారు.

Written By: Gopi, Updated On : June 24, 2024 10:51 am

What is the relationship between Amitabh and Deepika Padukone in Kalki

Follow us on

Kalki Movie: ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న కల్కి సినిమాకు సంబంధించిన టికెట్లను నిన్న బుక్ మై షో లో వదిలారు. ఇక అవి వదిలిన కొన్ని క్షణాల్లోనే మొత్తం బుక్ అయిపోవడం అనేది కల్కి సినిమా మీద ఉన్న క్రేజ్ ని మరొకసారి మనందరికీ తెలిసేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ఎన్నో రూమర్స్, ఎన్నో వార్తలు, ఎన్నో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. వాటన్నింటికి ఈనెల 27వ తేదీన ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటూ సినిమా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే అమితబచ్చన్, దీపికా పదుకొనే చేసిన క్యారెక్టర్లకి మధ్య ఇంటర్ లింక్ ఏంటి అంటూ కొంతమంది ఆరా తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే అమితాబచ్చన్, దీపిక పదుకునే తండ్రి కూతుళ్లుగా నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే అమితాబచ్చన్ తన కూతురు అయిన దీపిక పదుకొనే ను ఎప్పుడు కాపాడుకుంటూ వస్తాడని ఈ క్రమంలోనే వీళ్ళ స్టోరీలోకి భైరవ ఎంటర్ అవుతాడనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.

Also Read: Anirudh Ravichander: అనిరుధ్ తెలుగు సినిమాలను ఎందుకు అంత చీప్ గా చూస్తున్నాడు…

మరి ఇలాంటి క్రమంలో అమితాబచ్చన్ దీపిక పదుకొనే బైరవ ముగ్గురు కలిసి కలి మీద పోరాటం చేస్తారట. మరి కలి ఎలాంటి విపత్కర పరిస్థితులను కల్గించబోతున్నాడు. ఆయన చేసే పనులు ఏంటి? చెడ్డ పనులు చేసి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నాడనే ఒక పాయింట్ ని ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించబోతున్నారట. అలాగే సృష్టి మొత్తం అంతరించిపోవడానికి గల కారణాలను కూడా చాలా స్పష్టంగా కన్నులకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం పట్ల మరోసారి సోషల్ మీడియా లో చర్చ జరుగుతుందా..?

మరి ఈ దెబ్బతో నాగ్ అశ్విన్ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి…ఇక ప్రభాస్ ఇప్పటికే యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి టాప్ హీరోగా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు…