War 2: వార్ 2 సినిమాలో ఎన్టీయార్ సెకండ్ హీరోగా చేస్తున్నాడా..?

War 2: త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సహాయక పాత్రనైతే పోషించాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేయబోతున్నాడు అంటూ వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు.

Written By: Gopi, Updated On : June 24, 2024 10:56 am

Is NTR playing the second hero in War 2

Follow us on

War 2: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ముగిసిన తర్వాత వార్ 2 సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్లో తను బిజీ కానున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటించడం పట్ల కొంతమంది తెలుగు సినిమా విమర్శకులు సైతం ఆయన మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ఎందుకంటే వార్ 2 సినిమాలో కూడా హృతిక్ రోషన్ హైలెట్ కాబోతున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సహాయక పాత్రనైతే పోషించాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేయబోతున్నాడు అంటూ వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకు అంటే బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళని డామినేట్ చేయాలని చూస్తుంటారు. అలాంటిది ఎన్టీయార్ క్యారెక్టర్ కంటే హృతిక్ రోషన్ తన క్యారెక్టర్ ని తగ్గించుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర మాత్రం సపోర్టింగ్ క్యారెక్టర్ లాగే ఉంటుంది తప్ప మెయిన్ హీరోగా ఉండే పరిస్థితి అయితే లేదు అనే అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిమీద జూనియర్ ఎన్టీఆర్ గానీ, సినిమా యూనిట్ గానీ ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.

Also Read: Anirudh Ravichander: అనిరుధ్ తెలుగు సినిమాలను ఎందుకు అంత చీప్ గా చూస్తున్నాడు…

నిజానికి విమర్శకులు చెప్పినట్టుగా ఎన్టీఆర్ పాత్ర చాలా చిన్నగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి క్రమం లో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. స్ట్రైయిట్ గా బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాగుండేది. అలా కాకుండా ఇలా హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఎలాగో ఇప్పుడు ‘దేవర ‘ సినిమా వస్తుంది కాబట్టి ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం పట్ల మరోసారి సోషల్ మీడియా లో చర్చ జరుగుతుందా..?

ఇక బాలీవుడ్ వాళ్ళు ఎన్టీయార్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూశారే తప్ప ప్రత్యేకంగా వార్ 2 సినిమా ద్వారా ఎన్టీఆర్ కి ఒరిగేదైతే ఏమీ ఉండదని విమర్శకులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పలేము అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…