Mythology Inspiration Movies: పురాణాల స్ఫూర్తి తో తీసిన ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటి..?

చాలా సినిమాలు కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల ప్లాప్ అవుతూ ఉంటాయి. అంతే తప్ప మంచి కథలు ఎప్పుడు ప్లాప్ అవ్వవు.. ఇక మనం చూసిన కొన్ని సంఘటనల ద్వారా కానీ, మనం చదివిన ఒక నవల ద్వారా కానీ కొత్త కథలు పుట్టవచ్చు...

Written By: Gopi, Updated On : August 2, 2024 8:25 am

Mythology Inspiration Movies

Follow us on

Mythology Inspiration Movies: సినిమా ఇండస్ట్రీలో మంచి కథలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇక నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమాలకైతే ఇంకా మంచి ఆదరణ లభిస్తుంది. నిజానికి ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఆ సినిమా కథ బాగుండాలి. అప్పుడే ఆ మూవీ ప్రేక్షకుడికి ఒక మంచి ఇంపాక్ట్ ను ఇవ్వగలుగుతుంది… అలాగే కొంచెం కొత్తగా ఉంటే ఒకటికి పది సార్లు ఆ సినిమాను చూడడానికి చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే పురాణాలను బేస్ చేసుకొని వచ్చిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందులో ముఖ్యంగా ఒక మూడు సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. జగపతిబాబు హీరోగా, ఆమని హీరోయిన్ గా ఎస్సీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘శుభలగ్నం ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో ఆమని డబ్బు మీద దురాశతో తన భర్తని సైతం అమ్మేస్తుంది. ఇక పురాణాల ప్రకారం ఈ కథని కనక మనం చూసుకున్నట్లైతే శ్రీకృష్ణ అవతారంలో కృష్ణుడి భార్య అయిన సత్యభామ అతన్ని అమ్మేయడానికి శ్రీకృష్ణ తులాభారం ని ఏర్పాటు చేస్తుంది… ఇక అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా జగపతిబాబు, ఆమని కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

Also Read: బాలీవుడ్ ఆ విషయం మర్చిపోయింది… హిందీ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక ఆయన మహాభారతంలోని కర్ణుడి జీవిత కథను ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాలో దుర్యోధనుడు – కర్ణుడి మధ్య ఉన్న మంచి ఫ్రెండ్షిప్ ను చూపిస్తూనే సినిమాని చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ – మమ్ముట్టి ల యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే మణిరత్నం ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు…

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్ గా వచ్చిన ‘వర్షం’ సినిమా కూడా పురాణాల ఆధారంగానే తెరకెక్కిందనే విషయం మనలో చాలామందికి తెలియదు…ఈ సినిమా రామాయణాన్ని బేస్ చేసుకొని వచ్చింది. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతే రాముడు వెళ్లి రావణ సంహారం చేసి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చే కథ నే రామాయణం… ఇక అదే విధంగా ఈ సినిమాలో రౌడీ అయిన గోపీచంద్ త్రిషను ఎత్తుకెళ్తే ప్రభాస్ వెళ్లి వాడిని చంపి ఆమెను తీసుకురావడమే ఈ సినిమా కథ..రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే మొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ను సాధించిన సినిమాగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది…

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలన్ని మన పురాణాల ఆధారంగా వచ్చి సక్సెస్ లను అందుకున్నాయి. ఇక వీటితో పాటుగా చాలా సినిమాలు కూడా పురాణాలను బేస్ చేసుకుని వచ్చాయి. అయినప్పటికీ వాటిని తెర మీద చూపించిన విధానంలో కొంచెం తేడా కొట్టి ఆ సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు. అంతే తప్ప ఇప్పుడు వచ్చే కథలేవి కూడా కొత్త కథలైతే కాదని చెప్పడానికి ఈ సినిమాలను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…

Also Read: హీరో దుల్కర్ సల్మాన్ భార్యను ఎప్పుడైనా చూశారా? హీరోయిన్స్ సరిపోరు!