Horoscope Today: ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏ పని చేపట్టినా విజయం వీరిదే..

ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు వచ్చే అవకాశం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : August 2, 2024 8:09 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు శుక్రవారం సందర్భంగా కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. దీంతో వారి ఆదాయం పెరుగుతుంది.మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం, తుల సహా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఆర్థిక పురోగతి సాధిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే వారికి గురువుల మద్దతు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు.

మిథున రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు వచ్చే అవకాశం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు.

కర్కాటక రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

సింహారాశి:
స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి కొన్ని పనులు అనుకూలిస్తాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని పనులు మొదలు పెడుతారు. అవి లాభించే అవకాశాలు ఎక్కువ.

కన్య రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కొన్ని మాటలతో బంధాల్లో చీలికలు వస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేరస్తారు. ఉద్యోగులు కొన్ని ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి:
ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకూల వాతావరణం. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వివాహానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు.

వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల్లో ఒకరికి డబ్బు సాయం చేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువగా వాదనలు చేయేయొద్దు. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సరదాగా ఉంటారు.

ధనస్సు రాశి:
కోర్టు సమస్యలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సహోద్యోగులతో సరదాగా ఉంటారు. ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకునేటప్పుడు ఆలోచించాలి.

మకర రాశి:
జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు. ఆదాయం తో పాటు ఖర్చులు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి కొత్త బాధ్యతలు చేపడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతంది.

కుంభరాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారుల మద్దతు పొందాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చిస్తారు.

మీనరాశి:
విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అనుకూల ఫలితాలు. కొత్త పెట్టుబడులకు ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.