https://oktelugu.com/

Ka Movie : క సినిమాను తమిళ్ లో గాని ఇతర స్టేట్స్ లో రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి..? అదే పెద్ద హీరోలకు అయితే ఇలా చేస్తారా..?

ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాతో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోగా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లో తెలుగు సినిమాల హవా కొనసాగుతుందనే చెప్పాలి... ఇక కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు చేయడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2024 / 10:02 PM IST

    KA Movie

    Follow us on

    Ka Movie :  దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘క’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… ఇక ఈ సినిమా మొదట పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి ఆ తర్వాత మాత్రం ఈ సినిమా తెలుగులోనే రిలీజ్ అయింది. ఇక తమిళ్ తో పాటు మిగతా స్టేట్స్ లో కూడా ఈ సినిమాని ప్లే చేయడానికి థియేటర్లు దొరక్క పోవడంతో సినిమాని అక్కడ రిలీజ్ చేయలేదు. అయితే ఈ సినిమాకి ఇక్కడి నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తమిళనాడు రాష్ట్రంలోని కొంతమంది యువకులు ఈ సినిమా యూనిట్ కి ఫోన్ ఆ సినిమాని మేము మిస్ అవుతున్నాం అంటూ మెసేజ్ లు పెడుతున్నారట.

    ఇక దీంతో రీసెంట్ గా ఈ ఇష్యూ పైన స్పందించిన కిరణ్ అబ్బవరం మా సినిమాని రిలీజ్ చేసుకోవడానికి అక్కడ మాకు కొన్ని థియేటర్లు ఇవ్వండి సక్సెస్ అయితే అవుద్ది లేకపోతే పోయిద్ది అంతే తప్ప మేము చేసిన సినిమాను ప్రోజెక్ట్ చేసుకోవడానికి మాకు ఒక ప్లాట్ ఫామ్ అయితే ఉండాలి కదా అంటూ చాలా ఎమోషనల్ గా కొన్ని మాటలైతే మాట్లాడాడు…

    నిజానికి స్టార్ హీరో సినిమాలు అయిన లేదంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సినిమాలకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురైతే వాటిని తొందర్లోనే సినీ పెద్దలు సాల్వ్ చేసేవారు. మరి ఈ హీరో విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. నిజానికి తమిళ్ నుంచి ఏ చిన్న సినిమా వచ్చిన మనం థియేటర్లను కేటాయిస్తాం మన సినిమాలతో పాటుగా ఆ సినిమాని కూడా ఆదరిస్తూ ఉంటాం.

    మరి తమిళులు మాత్రం ఎందుకు మన సినిమాలను చిన్నచూపు చూస్తున్నారు. సినిమా చేసిన వ్యక్తి దాన్ని రిలీజ్ చేసుకునే హక్కు కూడా లేదా అంటూ ఈ విషయం పైన సినీ మేధావులు సైతం ఘాటు గా స్పందించడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం క సినిమా మాత్రం ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ ని సాధించి అతనికి ఒక మంచి సక్సెస్ అయితే అందించిందనే చెప్పాలి…