https://oktelugu.com/

Australia vs Pakistan : సమయానికి సన్ రైజర్స్ కెప్టెన్ వచ్చి గెలిపించాడు.. లేకుంటే పాకిస్తాన్ చేతిలో పరువు పోయేది!

క్రికెట్లో మిగతా జట్లతో పోలిస్తే పాకిస్తాన్ పూర్తి విభిన్నం. ఆ జట్టు ఎప్పుడు బాగా ఆడుతుందో? ఎప్పుడు సంచలనాలు సృష్టిస్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఆ జట్టు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 4, 2024 / 10:03 PM IST

    Australia vs Pakistan

    Follow us on

    Australia vs Pakistan : ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ వెంట్రుక వాసిలో విజయాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టుకు స్వదేశంలోనే చుక్కలు చూపించింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఆపద్బాంధవుడు పాత్ర పోషించాడు కాబట్టి సరిపోయింది.. లేకుంటేనా పాకిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా జట్టు పరువు పోయేది.. కమిన్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో సంచలన ప్రశ్నించాడు.. అసాధారణమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు 3 వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాడు.. మెల్ బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరిదాకా ఉత్కంఠ గా సాగింది. లోయర్ ఆర్డర్ లో కమిన్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. 31 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు కొట్టాడు. 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు గెలుపును దూరం చేశాడు.

    203 పరుగుల విజయ లక్ష్యం

    ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. టాస్ ఆస్ట్రేలియా గెలిచినప్పటికీ.. బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 రన్స్ చేసి ఆల్ అవుట్ అయింది. బాబర్ అజామ్(37), రిజ్వాన్(44), నసీం షా(40) సత్తా చాటారు. స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ , జంపా చెరో రెండు వికెట్లు సాధించారు. అబాట్, లబూ షేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్ విధించిన 204 రన్స్ టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా.. చివరిదాకా పోరాడింది. స్మిత్ (44), ఇంగ్లిస్(49) మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో రౌఫ్ మూడు వికెట్లు సాధించా. షాహిన్ ఆఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు.. నసీం షా, మహమ్మద్ హస్ నైన్ చెరో వికెట్ సాధించారు.. వాస్తవానికి పాకిస్తాన్ విధించిన లక్ష్యం స్వల్పం అయినప్పటికీ.. దానిని ఛేదించడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో 185 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి, ఆస్ట్రేలియా ఓటమి వైపు ప్రయాణించింది. ఈ క్రమంలో స్టార్క్, కమిన్స్ పాకిస్తాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. తీవ్ర బత్తిని ఉన్నప్పటికీ అసాధారణ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కమిన్స్ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తను మాత్రమే ఎక్కువగా బ్యాటింగ్ చేసి.. జట్టు విజయాన్ని అవసరమైన 19 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా జట్టుకు గెలుపును అందించాడు.. కమిన్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను గెలిపించిన నేపథ్యంలో.. హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ” హైదరాబాద్ కెప్టెన్ అద్భుతం చేశాడు. జట్టులో పోరాడే స్ఫూర్తిని నింపాడు. ఓటమి అంచులో ఉన్నప్పుడు తెగువ చూపాడు. చివరికి జట్టుకు కావలసిన విజయాన్ని అందించాడు. ఒక కెప్టెన్ ఎలా ఉండాలో నిరూపించాడు. అతని ఆధ్వర్యంలో ఈసారి కావ్య పాప జట్టు ఐపిఎల్ కప్ గెలుస్తుందని” హైదరాబాద్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.