https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 లో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ కి పెద్దగా ప్రాముఖ్యత లేదా..?ఎందుకలా చేశారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్... ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని తద్వారా పాన్ ఇండియాలో కూడా తనలాంటి దర్శకుడు మరొకరు లేరు అనేంతల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2024 / 09:53 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ప్రస్తుతం ఆయనకు పాన్ ఇండియాలో హీరోగా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం లో ఈ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘పుష్ప 2’ సినిమాలో ఫాహద్ ఫజిల్ తనదైన రీతిలో నటన ప్రతిభను చూపించబోతున్నాడు అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలో ఆయనకి అంతగా యాక్టింగ్ చేసే స్కోప్ అయితే లేదని ఆ క్యారెక్టర్ జస్ట్ వచ్చి పోయే క్యారెక్టర్ లాగానే సుకుమార్ ట్రీట్ చేసి మరీ షూట్ చేసినట్టుగా కొంతమంది కొన్ని వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న ఫాహాద్ ఫజిల్ తో ఈ సినిమాలో నటింపజేయాలని సుకుమార్ అనుకున్నప్పటికీ పుష్ప 2 స్టోరీని మళ్లీ మార్చి రాసినప్పుడు ఆయన క్యారెక్టర్ కి అంత స్కోప్ లేకుండా రాసుకున్నారట.

    దానివల్ల కూడా ఈ సినిమాతో ఫాహాద్ ఫజిల్ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన గత కొన్ని రోజుల క్రితం పుష్ప 2 గురించి కొన్ని నెగటివ్ కామెంట్స్ ని కూడా చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫాహద్ ఫజిల్ లాంటి నటుడు ఈ సినిమా కోసం మరి కొన్ని సినిమాలను కూడా వదిలేసుకున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.

    అందుకే ఆయన సుకుమార్ మీద కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ద్వారా ఆయన భారీగా నిరాశ చెందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తన నటన ప్రతిభను చూపించుకోవడానికి మిగతా సినిమాలకి కమిటై ముందుకు దూసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది..