https://oktelugu.com/

Rana Daggubati: వెంకటేష్ లా రానా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

విక్టరీ వెంకటేష్ గా కూడా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒక స్టార్ హీరోగా వెలుగొందడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా వచ్చిన రానా మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 3, 2024 9:08 am
    Rana Daggubati

    Rana Daggubati

    Follow us on

    Rana Daggubati: మొదటి నుంచి కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. డాక్టర్ డి రామానాయుడు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా మారి మంచి సినిమాలను చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక ప్రొడ్యూసర్ గా కూడా తన పేరుని ‘గిన్నిస్ బుక్ రికార్డుల్లో ‘ నమోదు చేసుకున్నాడు. ఇక ఇలాంటి ‘మూవీ మొగల్ ‘ డాక్టర్ ‘ డి రామానాయుడు’ కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చిన వెంకటేష్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను అందుకున్నాడు.

    అలాగే విక్టరీ వెంకటేష్ గా కూడా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒక స్టార్ హీరోగా వెలుగొందడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా వచ్చిన రానా మాత్రం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. దానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చేసిన రెండు, మూడు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేయడం కంటే మంచి పాత్ర దొరికితే అందులో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని అనుకున్నాడు.

    ఆ ఒక్క కారణం వల్లనే తను స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు అని ఇప్పటికీ చాలామంది సినీ మేధావులు సైతం చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన బాహుబలి, భీమ్లా నాయక్, రుద్రమదేవి లాంటి సినిమాల్లో నటించి తనకంటూ నటుడిగా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే రానాకి హీరోగా చేయడం కంటే మంచి క్యారెక్టర్ లో చేయడమే ఎక్కువ ఇంట్రెస్ట్ అని ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పాడు. ఇంక మాట్లాడుతూ తను స్టార్ హీరోగా ఎదగలేకపోయిననే బాధ ఏమీ లేదుని చెప్పాడు.

    ఎందుకంటే హీరో అయితే ఒక్క క్యారెక్టర్ లో మాత్రమే నటించాలి, ఆయన ఇమేజ్ చూసుకోవాలి, ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉండాలి వాళ్ళకి చాలా క్యాలిక్లేశన్స్ ఉంటాయి. అదే ఏ పాత్ర లో అయిన నటించే నాలాంటి వాళ్ళు చాలా క్యారెక్టర్లల్లో నటించొచ్చు అని తను ఒక గొప్ప మాట చెప్పాడు. ఇక అందువల్లే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ ఎలాగైతే స్టార్ హీరోగా మారాడో రానా అలా స్టార్ హీరోగా ఎదిగలేకపోయాడు.